Geetu vs Shanmukh Fans: ‘నువ్వు బాడీ షేమింగ్ చేసినప్పుడు ఏమైంది’.? గీతూపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతోన్న షణ్ముఖ్ ఫ్యాన్స్..
Shanmukh Geetu: సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. తమ ప్రతిభను ప్రపంచానికి చాటుతూ ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అలాంటి వారిలో షణ్ముఖ్, గీతూ ఒకరు. అయితే ఇటీవల షణ్ముఖ్ ఫ్యాన్స్‌కు, గీతూకు మధ్య...
Geetu vs Shanmukh Fans: సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. తమ ప్రతిభను ప్రపంచానికి చాటుతూ ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అలాంటి వారిలో షణ్ముఖ్, గీతూ ఒకరు. అయితే ఇటీవల షణ్ముఖ్ ఫ్యాన్స్‌కు, గీతూకు మధ్య చిన్న సైజ్ యుద్ధమే జరుగుతోంది. గతంలో గీతూ చేసిన వ్యాఖ్యలపై తాజాగా షణ్ముఖ్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఇంతకీ గీతూ, షణ్ముఖ్‌ల మధ్య నెలకొన్న ఆ వివాదం ఏంటి.? గీతూపై షన్ను ఫ్యాన్స్ ఫైర్ కావడానికి కారణమేంటి.? లాంటి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గీతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ నేను చిన్ననాటి బాడీ షేమింగ్‌ను ఎదుర్కున్నాను, ఇంట్లో వాళ్లు కూడా బాడీ షేమింగ్ చేశారు. అయితే ఇటీవల తన కజిన్, ఫ్రెండ్స్‌తో మాట్లాడితే ముందు మన శరీరాన్ని మనం ప్రేమించుకోవాలని తెలిపారు. నేనేమో పిచ్చిదానిలా ఏడుస్తున్నాను. ఇతరులు మీ శరీరం గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోకండి. మనుషుల చూపులను బట్టి వారిని అంచనా వేయకండి. దయచేసి బాడీ షేమింగ్ చేయొద్దు’ అంటూ గీతూ ఏడ్చేసింది.
ఇక్కడే అసలు కథ..
గీతూ బాడీ షేమింగ్ గురించి మాట్లాడితే షణ్ముఖ్ ఫైన్స్ ఎందుకు అటాక్ చేశారనేగా మీ సందేహం. అసలు విషయం తెలియాలంటే కొన్ని రోజులు వెనక్కి వెళ్లాలి. షణ్ముఖ్ బిగ్‌బాస్‌లో పాల్గొన్న సమయంలో గీతూ బిగ్ బాస్ షోపై రివ్యూలు ఇచ్చింది. ఆ సమయంలోనే షణ్ముఖ్‌ని బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్ చేసింది. దీంతో ప్రస్తతం బాడీ షేమింగ్‌పై మాట్లాడడంతో షణ్ముఖ్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. గతంలో షణ్ముఖ్‌ను బాడీ షేమింగ్ చేసినప్పుడు ఏమైంది.? నీకు ఒక న్యాయం ఇతరులకు మరో న్యాయమా.? అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ట్రోలింగ్‌పై స్పందించిన గీతూ..
తనపై జరుగుతోన్న ట్రోలింగ్‌పై గీతూ ఎట్టకేలకు స్పందించింది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. ‘బిగ్‌బాస్ గేమ్ జడ్జ్ చేయడమే నా పని. షణ్ముఖ్ గురించి అనలేదా అని నన్ను తిడుతున్నారు. అయితే ఆయన బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత షణ్ముఖ్ పేరు కూడా ఎత్తలేదు. పాత విషయాలను పట్టుకుని వేలాడే వారిని నిబ్బాస్ అంటారు. కొంచెం మారండి’ అంటూ ట్రోల్స్ చెక్ పెట్టే పని చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..