Salman Khan: విశాఖలో నేవీ సిబ్బందితో సల్మాన్ ఖాన్ స్వాతంత్య వేడుకలు.. వంట చేసి ఆడి పాడిన స్టార్ హీరో

ప్రస్తుతం పలు చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్న సల్మాన్ ఖాన్.. కొంత సేపు షూటింగ్స్ కు విరామం ప్రకటించారు. అంతేకాదు ఈ విరామంలో  విశాఖపట్నంలో నావికులతో ఒక రోజు గడిపాడు.

Salman Khan: విశాఖలో నేవీ సిబ్బందితో సల్మాన్ ఖాన్ స్వాతంత్య వేడుకలు.. వంట చేసి ఆడి పాడిన స్టార్ హీరో
Salman Khan Waves Flags
Follow us
Surya Kala

|

Updated on: Aug 11, 2022 | 1:47 PM

Salman Khan in Visakha: దేశ వ్యాప్తంగా స్వాతంత్య దినోత్సవ వేడుకల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. మన దేశం బ్రిటిష్ పాలకుల నుంచి  దాస్య శృంఖలాలు తెంచుకుని 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా స్వాతంత్యదినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. విశాఖ పట్నంలోని ఇండియన్ నేవీ సిబ్బందితో సల్మాన్ ఖాన్ స్వాతంత్య వేడుకలను జరుపుకున్నారు.

ప్రస్తుతం పలు చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్న సల్మాన్ ఖాన్.. కొంత సేపు షూటింగ్స్ కు విరామం ప్రకటించారు. అంతేకాదు ఈ విరామంలో  విశాఖపట్నంలో నావికులతో ఒక రోజు గడిపాడు.  ఈ సందర్భంగా నావీ సిబ్బందితో పాటు.. సల్మాన్ ఖాన్ గర్వంగా త్రివర్ణ పతాకాన్ని చేతబూని… జెండాను ఊపూతూ వేడుకలను జరుపుకున్నారు. భారత నౌకా దళ తూర్పు కమాండుకు ప్రధాన స్థావరమైన విశాఖపట్నంలోని నావికులతో కలిసి   వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందు సల్మాన్ ఖాన్ భారత జెండాను ఊపుతూ వేడుకలను జరుపుకున్నారు. నావికులతో కలిసి డ్యాన్స్ చేశారు. పుష్-అప్‌లతో చేశారు. భారత నావికాదళ సిబ్బందితో కలిసి వంట చేశారు. నటుడు తెల్లటి చొక్కా, నలుపు డెనిమ్ ఫ్యాన్స్ ధరించి హ్యాండ్ సమ్ లుక్ లో కనిపించారు. నేవీ సిబ్బంది ధరించే టోపీని ధరించాడు.  ప్రస్తుతం సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

సల్మాన్ ఖాన్ చివరిసారిగా ఆయుష్ శర్మతో కలిసి యాంటిమ్: ది ఫైనల్ ట్రూత్‌లో కనిపించాడు. ప్రస్తుతం బాలీవుడ్ కభీ ఈద్ కభీ దీపావళి, కిక్ 2,  టైగర్ 3  లతో పాటు.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే