AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhrapradesh: నాన్ వెజ్ ప్రియులకు షాక్..ఏపీలో భారీగా పెరిగిన చికెన్ ధరలు..

శ్రావణ మాసంలోనైనా ధరలు తగ్గితూ ఫుల్ గా లాగించేద్దామనుకున్న నాన్ వెజ్ ప్రియులకు నిరాశతప్పడం లేదు. రోజు రోజుకి చికెన్ ధరలకు రెక్కలు రావడంతో వినియోగదారులు వెనకడుగు వేస్తున్నారు. చికెన్ ధరలు పెరగడంతో బిర్యానీ రేట్లు ప్రియం

Andhrapradesh: నాన్ వెజ్ ప్రియులకు షాక్..ఏపీలో భారీగా పెరిగిన చికెన్ ధరలు..
Chicken
Amarnadh Daneti
|

Updated on: Aug 11, 2022 | 1:59 PM

Share

Andhrapradesh: శ్రావణ మాసంలోనైనా ధరలు తగ్గితూ ఫుల్ గా లాగించేద్దామనుకున్న నాన్ వెజ్ ప్రియులకు నిరాశతప్పడం లేదు. రోజు రోజుకి చికెన్ ధరలకు రెక్కలు రావడంతో వినియోగదారులు వెనకడుగు వేస్తున్నారు. చికెన్ ధరలు పెరగడంతో బిర్యానీ రేట్లు ప్రియం కావడంతో నాన్ వెజ్ లవర్స్ డిస్సాపాయింట్ అవుతున్నారు. చికెన్ కొందామని షాపులకు వెళ్లిన వినియోగదారులు బోర్డుపై ధరలను చూసి షాకవుతున్నారు మాంస ప్రియులు. పెరిగిన ధరలతో చికెన్ కు డిమాండ్ తగ్గడంతో వ్యాపారం లేక చికెన్ వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పెరిగిన మేత ధరలతో కొత్త బ్యాచ్‌లు వేసేందుకు కోళ్ల రైతులు విముఖత చూపుతున్నారు. కోనసీమ జిల్లాలో లభ్యత తక్కువగా ఉండటంతో తెలంగాణతో పాటు జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా చికెన్‌ ధరలకు రెక్కలొచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. కాగా స్కిన్‌లెస్‌ చికెన్‌ కిలో రూ.300కు చేరగా, లైవ్‌ చికెన్‌ కిలో రూ.160 రూపాయలకు పెరిగింది.

తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో రోజుకు సాధారణంగా 3.2 లక్షల కిలోల చికెన్‌ వినియోగిస్తుండగా, ఆదివారం, పండగ రోజుల్లో ఈఅమ్మకాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ను బట్టి రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్‌లు వేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆగస్టు నుంచి డిసెంబరు వరకు అన్‌సీజన్‌గా భావించి కొత్త బ్యాచ్‌లు వేయడం తగ్గిస్తారు. కోళ్లకు ఆహారంగా అందించే మొక్కజొన్న, సోయా తదితర మేత ధరలు కొద్ది నెలలుగా విపరీతంగా పెరిగిపోవడంతో సొంతంగా నిర్వహణ చేయలేక అధికశాతం మంది కోళ్ల రైతులు కమీషన్‌పై కోడిపిల్లలను పెంచి అప్పగించేందుకుబ్రాయిలర్‌ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. కేవలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లానే కాకుండా ఏపీ వ్యాప్తంగానూ చికెన్ ధరలు ఇలాగే ఉన్నాయి. శ్రావణమాసంలో చికెన్ రేట్లు తగ్గుతాయని..ఈసారి మాత్రం ధరలు తగ్గలేదంటున్నారు నాన్ వెజ్ లవర్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..