Andhra Pradesh: ఏపీలో రూ.200 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన మరో సంస్థ.. 500 మందికి ఉద్యోగ అవకాశాలు
Andhra Pradesh: ఏపీలో రూ.200 కోట్ల పెట్టుబడులతో ప్లాంట్‌ను నిర్మించేందుకు ముందుకొచ్చింది ఓ సంస్థ. ఈ ప్లాంట్ ఏర్పాటుతో సుమారు 500 మందికిపైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి..
Andhra Pradesh: ఏపీలో రూ.200 కోట్ల పెట్టుబడులతో ప్లాంట్‌ను నిర్మించేందుకు ముందుకొచ్చింది ఓ సంస్థ. ఈ ప్లాంట్ ఏర్పాటుతో సుమారు 500 మందికిపైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఏజీఅండ్‌పీ ప్రథమ్ కంపెనీ ఏపీలో వంశాలలకు సహాజ వాయువును అందించడానికి ఈ ప్లాంట్‌ను నెలకొల్పనుంది. ఇందుకు సంబంధించిన ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీని ద్వారా వందలాది మందికి ప్రతక్ష, పరోక్ష ఉపాధి లభించనుందని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది ప్రముఖ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏజీ అండ్ పీ ప్రథమ్, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ కంపెనీ వచ్చే ఐదేళ్లలో కడప జిల్లాలో రూ. 200 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ పెట్టుబడుల కారణంగా జిల్లాలో 500 మందికి పైగా ప్రతక్ష, పరోక్షంగా ఉపాధి లభించనుంది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రోత్సహంతో సహజ వాయువు ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోవడానికి ఏజీ అండ్ పీ అవిశ్రాంతగా కృషి చేస్తోందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు స్థానిక వినియెగదారులకు, వంటశాలలకు సహజ వాయువును అందించడానికి, రవాణా రంగం కోసం సీ ఎన్ జీ ఫిల్లింగ్ స్టేషన్లకు సహజ వాయువుని తీసుకురావడానికి ఏపీలోని ఉమ్మడి 4 జిల్లాలలో గ్యాస్ పైప్ లైన్ నెట్‌వర్క్‌ను, ఏజీ అండ్ పీ ప్రథమ్ YSR జిల్లాలోని కడపలో ఎల్ సీ ఎన్ జీ ప్లాంటు ను ఏర్పాటు చేస్తోంది. కడప నగరానికి వంట ఇంధనం, సీఎన్‌జీలను సమర్థంగా అందించేలా ఈ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల కడప ఎల్‌సీఎన్‌జీ నిర్మాణంతో కడప జిల్లా ప్రజలకు ఇంధన ఖర్చులు, పెట్రోలు కంటే 30శాతం వరకు తగ్గుతుందన్నారు. ఎల్‌పీజీ సిలిండర్ కంటే వంట ఇంధనంలో 20 శాతం ఆదా చేయడం సాధ్యమవుతాయన్నారు.
ఈ సందర్భంగా ఏజీఅండ్ పీ ప్రథమ్ కడప జిల్లా ప్రాంతీయాధిపతి గుమాలపల్లి వెంకటేశ్ మాట్లాడుతూ.. కడపను స్వచ్ఛమైన జిల్లా చేయడానికి ఏజీ అండ్ పీ ప్రథమ్ కృషిచేస్తోందన్నారు. ఇందుకోసం చౌకైన సహజవాయువును సులభంగా అందిస్తోందని, ఏపీ విషయంలో మరింత విస్తృతంగా అలోచించి, ఏజీ అండ్ పీ ప్రథమ్ కడపలో ఎల్‌సీఎన్‌జీ (Liquid to Compressed Natural Gas) స్టేషన్‌ను అభివృద్ధి చేయడం సెప్టెంబర్ 2022 నాటికి ప్లాంటు నిర్మాణ పనులు పూర్తి చేసి, జిల్లా అధికారుల సహకారంతో ప్రారంభించటం జరుగుతుందన్నారు. ప్లాంట్, పైప్‌లైన్ నిర్మాణానికి సహకరించిన జిల్లా అధికారులకు ప్రత్యేకముగా ధన్యవాదములు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు. పెట్రోలియం అండ్ సహజ వాయువు నియంత్రణ మండలి (PNGRB) ద్వారా పేర్కొన్న సహజ వాయువు పైప్‌లైన్‌ల భద్రతా ప్రమాణాలతో సహా అన్ని సాంకేతిక ప్రమాణాలు పాటించడం జరుగుతుందన్నారు.
కడప మున్సిపల్ కార్పొరేషన్ (KMC) పరిధిలోకి వచ్చే పుట్లంపల్లి ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియా (IDA)లో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొదటి దశలో పుట్లంపల్లి నుంచి సైనిక్‌నగర్, విక్లాంగ్‌నగర్, రామాంజనేయపురం, స్వరాజ్‌నగర్, అరవింద్‌నగర్, ప్రకాష్‌నగర్, ఎన్‌జీవో కాలనీ, రెడ్డి కాలనీ, భాగ్యనగర్ కాలనీ, వైఎస్‌ఆర్ కాలనీ వరకు సహజవాయువు పైపులైన్ పనులు, ఇంటి కనెక్షన్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని అన్నారు. ఈ పారిశ్రామికీకరణను వేగవంతం చేయడం వల్ల ఉద్యోగాలను సృష్టించడం, కాలుష్యాన్ని తగ్గించడం, అలాగే స్థిరమైన వాతావరణాన్ని పెంపొందించడం జరుగుతుందన్నారు. తద్వారా ప్రజలకు నాణ్యమైన సహజ వాయువు అందించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి