Viral Video: డీజే టిల్లు పాటకు ఉత్సాహంగా స్టెప్పులేసిన తెలంగాణ మంత్రులు, సీపీ ఆనంద్.. వైరలవుతోన్న వీడియో
Hyderabad: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో 5K రన్‌ని ఘనంగా నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ సెంటర్ నుంచి ఈ రన్ మొదలైంది. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్,
Hyderabad: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో 5K రన్‌ని ఘనంగా నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ సెంటర్ నుంచి ఈ రన్ మొదలైంది. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ సోమేష్ కుమార్, సీపీ సీవీ ఆనందర్ జెండా ఊపి 5 కే రన్‌ను ప్రారంభించారు. వీరితో పాటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, పెద్ద ఎత్తున యువత ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా డీజే టిల్లు సినిమా పాటకు మంత్రులు, పోలీసులు ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేయడం అందరినీ ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి మహమూద్ అలీ 5కె రన్‌లో యువత ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. అలాగే స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 15 వ తేదీన ఇంటింటా జాతీయ జెండా ఎగరవేయాలని సూచించారు. అలాగే ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే మన దేశానికే స్వాతంత్య్రం వచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఇక భారత స్వాతంత్య్ర డైమండ్ జూబ్లీ వేడుకలు జరుపుకోవడం చాలా గర్వంగా ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద సహచర మంత్రి మహమూద్ అలీ గారు, CS సోమేష్ కుమార్ గారు, ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు మరియు పోలీస్ కమిషనర్ ఆనంద్ గారితో కలిసి 5k రన్ ను ప్రారంభించడం జరిగింది.#SwathantraBharataVajrotsavalu #IndiaAt75 pic.twitter.com/1dkK6YJEKH
— Talasani Srinivas Yadav (@YadavTalasani) August 11, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..