AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shahid Kapoor: బంతి తగలడంతో పెదవికి 25 కుట్లు పడ్డాయి.. ఇప్పటికీ ఆ గాయం మానలేదు: జెర్సీ హీరో షాహిద్‌

బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ నటిస్తోన్న తాజా చిత్రం 'జెర్సీ'. నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెలుగులో సూపర్‌ హిట్‌ సాధించిన 'జెర్సీ'కి రీమేక్‌గా ఇది తెరకెక్కింది

Shahid Kapoor: బంతి తగలడంతో పెదవికి 25 కుట్లు పడ్డాయి.. ఇప్పటికీ ఆ గాయం మానలేదు:  జెర్సీ హీరో షాహిద్‌
Basha Shek
|

Updated on: Nov 28, 2021 | 8:37 PM

Share

బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘జెర్సీ’. నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెలుగులో సూపర్‌ హిట్‌ సాధించిన ‘జెర్సీ’కి రీమేక్‌గా ఇది తెరకెక్కింది. నాని పాత్రలో షాహిద్‌ కనిపించనున్నాడు. మృణాళి ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించింది. తెలుగు ‘జెర్సీ’ని తెరకెక్కించిన గౌతమ్‌ తిన్ననూరినే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు, అల్లు అరవింద్, పవన్ గిల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ‘జెర్సీ’ సినిమా షూటింగ్‌లో భాగంగా ఒకసారి తీవ్రంగా గాయపడ్డాడు. క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా బంతి తగిలి కింది పెదవికి తీవ్రగాయమైంది. కాగా ఈ విషయంతో పాటు సినిమాకు సంబంధించి మరికొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు షాహిద్‌.

‘తెలుగు ‘జెర్సీ’లో నాని అద్భుతంగా నటించాడు. నేను అంత బాగా నటించలేనని మొదట్లో ఈ సినిమా రీమేక్‌కు నో చెప్పాను. అంతకుముందే విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్ సింగ్’లో నేనే హీరోగా నటించాను. వెంటవెంటనే రీమేక్‌లు చేసి రిస్క్‌లో పడకూడదనుకున్నాను. ఒరిజినల్ వెర్షన్‌లో హీరో చేసిన నటనను రీమేక్‌లో మళ్లీ ఇంకొక యాక్టర్‌ అందుకోవడం చాలా కష్టం. అందుకే మొదట్లో ఈ మూవీని వద్దనుకున్నాను. కానీ ఆ సినిమా కథ నా మదిలో మెదులుతూనే ఉంది. అందుకే రీమేక్‌కు సై అనేశాను. ఇందుకోసం క్రికెట్‌ కూడా నేర్చుకున్నాను. అయితే క్రికెట్‌ ప్రాక్టీస్‌లో బంతి ప్రమాదవశాత్తూ నా కింది పెదవిని చిదిమేసింది. తీవ్ర రక్తస్రావమైంది. చికిత్స చేసిన వైద్యులు ఏకంగా 25 కుట్లు వేశారు. దీంతో రెండు నెలలు షూటింగ్‌కి బ్రేక్‌ పడింది. తీవ్ర గాయం కావడంతో నేను మళ్లీ మునుపటిలా కనిపిస్తానని అస్సలు అనుకోలేదు. ఇప్పటికీ నా పెదవిలో కొంత భాగం చచ్చుబడిపోయినట్టే ఉంటోంది. నేను ఆ భాగాన్ని మాములుగా కదల్చలేకపోతున్నాను ‘ అని అప్పటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు షాహిద్‌.

Also Read:

Deepika Pilli: తన అందాలతో కుర్రకారు మతిపోగొడుతున్న చిన్నది.. దీపికా పిల్లి ఫోటో గ్యాలరీ

పెళ్లికి రాలేని వారికి ప్రత్యేక బహుమతి పంపిన బాలీవుడ్‌ న్యూ కపుల్‌.. గిఫ్ట్‌ ఫ్యాక్‌లో ఏమున్నాయంటే..

Salman Khan: థియేటర్‌లో ఫ్యాన్స్ చేసిన పనికి మండిపడిన కండల వీరుడు.. ఎందుకంటే..