AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లికి రాలేని వారికి ప్రత్యేక బహుమతి పంపిన బాలీవుడ్‌ న్యూ కపుల్‌.. గిఫ్ట్‌ ఫ్యాక్‌లో ఏమున్నాయంటే..

పదేళ్ల ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకుంటూ ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు రాజ్ కుమార్ రావ్- పత్ర లేఖ

పెళ్లికి రాలేని వారికి ప్రత్యేక బహుమతి పంపిన బాలీవుడ్‌ న్యూ కపుల్‌.. గిఫ్ట్‌ ఫ్యాక్‌లో ఏమున్నాయంటే..
Basha Shek
|

Updated on: Nov 28, 2021 | 7:38 PM

Share

పదేళ్ల ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకుంటూ ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు రాజ్ కుమార్ రావ్- పత్ర లేఖ. చండీగఢ్‌లోని ఓ విలాసవంతమైన హోటల్‌ వేదికగా అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. బాలీవుడ్‌ లేడీ డైరెక్టర్‌ ఫరాఖాన్‌, ‘స్కామ్ 1992’ దర్శకులు హన్సల్‌ మెహతా లాంటి కొద్ది మంది సెలబ్రిటీలు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. కరోనా ఆంక్షలున్న నేపథ్యంలో దగ్గరి బంధువులతో పాటు సన్నిహితులు, స్నేహితులను మాత్రమే వివాహ వేడుకకు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో తమ పెళ్లికి హాజరుకాలేని వారికి ఓ ప్రత్యేకమైన బహుమతిని పంపించారు రాజ్‌కుమార్‌ రావ్‌- పత్రలేఖ. సినిమా ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులకు ఈ స్పెషల్‌ గిఫ్ట్స్‌ను అందుకున్నారు,

ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా కూడా ఈ ప్రత్యేక బహుమతి అందుకున్న వారిలో ఉంది. అందులో మోతీచూర్ లడ్డూ‌తో పాటు ఒక మెసేజ్‌ నోట్‌ ఉంది. ‘మేం 11ఏళ్లుగా ఒకరికి మరొకరు తెలుసు. ఇటీవల చండీగఢ్‌లో మేం పెళ్లి చేసుకున్నాం. మా జీవితాల్లోని ప్రత్యేకమైన రోజుకు మీరు హాజరు కాలేక పోయినందుకు బాధగా ఉంది. అందుకే మా పెళ్లి సందర్భాన్ని పురస్కరించుకుని ఓ చిన్న గిఫ్ట్‌ను పంపిస్తున్నాం. ప్రేమతో.. మీ పత్రలేఖ- రాజ్ కమార్’ అని ఆ నోట్‌లో రాసి ఉంది. కాగా ఈ మెసేజ్ నోట్‌తో పాటు తనకు వచ్చిన మోతీచూర్‌ లడ్డూను సోషల్‌ మీడియాలో పంచుకుంది మసాబా. ‘కంగ్రాచ్యులేషన్స్’ అని కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపింది.

కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ
బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శ్రీలీల..
బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శ్రీలీల..
గృహప్రవేశం రోజున పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా?
గృహప్రవేశం రోజున పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా?