Salman Khan: థియేటర్‌లో ఫ్యాన్స్ చేసిన పనికి మండిపడిన కండల వీరుడు.. ఎందుకంటే..

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 55 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తున్న..

Salman Khan: థియేటర్‌లో ఫ్యాన్స్ చేసిన పనికి మండిపడిన కండల వీరుడు.. ఎందుకంటే..
Salman Khan
Follow us
Surya Kala

|

Updated on: Nov 28, 2021 | 7:32 PM

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 55 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తున్న సల్మాన్ ఖాన్ తాజా సినిమా ‘యాంటీమ్’ నవంబర్ 26న విడుదలైంది. ఈ   సినిమా రిలీజ్ సందర్భంగా సల్లూభాయ్ అభిమానులు చేసిన హంగామా పై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి.  సినిమా థియేటర్ లో ఫ్యాన్స్ చేసిన పిచ్చి పనిపై అందరితో పాటు.. సల్మాన్ ఖాన్ కూడా మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన తాజా చిత్రం “యాంటీమ్..  ది ఫైనల్ ట్రూత్” థియేట్రికల్ స్క్రీనింగ్ సందర్భంగా బాణసంచా కాల్చిన వీడియోను షేర్ చేస్తూ.. తన అభిమానులు ఇలాంటి పనులకు దూరంగా ఉండలని సూచించారు. అంతేకాదు ఇలాంటి పనులతో భారీ అగ్ని ప్రమాదంకలిగే అవకాశం ఉందని.. కనుక ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తన అభిమానులను సల్మాన్ ఖాన్ కోరారు. మీరు ఇలాంటి పనులు చేసి.. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దంటూ తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

అంతేకాదు ఇదే విషయంపై థియేట‌ర్‌ యజమానులకు కూడా కొన్ని సూచనలు చేశారు.  ఆడిటోరియం లోపలికి పటాకులు కాల్చడానికి అనుమతించవద్దని కూడా ఖాన్ థియేటర్ యజమానులను కోరారు. “సినిమా హాల్‌లోకి ఫైర్ క్రాకర్లను తీసుకెళ్లడానికి అనుమతించవద్దని థియేటర్ యజమానులకు నా అభ్యర్థన.. ఎంట్రీ పాయింట్ (sic) వద్ద అలా చేయకుండా సెక్యూరిటీ వారిని ఆపాలి” అని ఆయన అన్నారు.  సినిమాను ఎంజాయ్ చేయండి కానీ ఇలా కాదంటూ  స‌ల్మాన్ ట్విట్టర్ వేదికగా తన అభిమానులను రిక్వెస్ట్ చేశారు. ‘యాంటీమ్’ లో సల్మాన్ ఖాన్ పంజాబీ పోలీస్ ఆఫీసర్ గా కన్పించారు. అల్టిమేట్ సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించారు.

Also Read: ప్రసవ వేదనతో ఆసుపత్రికి సైకిల్ తొక్కుతూ వెళ్లి.. పండంటి పాపకు జన్మనిచ్చిన ఎంపీ.. వైరల్ స్టోరీ

లాటరీలో రూ. 20 కోట్లు గెలిచిన మహిళ.. తల్లకిందులైన జీవితం..
లాటరీలో రూ. 20 కోట్లు గెలిచిన మహిళ.. తల్లకిందులైన జీవితం..
కోట్లు పలికిన ప్రతిమను తలుపు అడ్డుగా వాడుకున్న జనం
కోట్లు పలికిన ప్రతిమను తలుపు అడ్డుగా వాడుకున్న జనం
వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..