ఆత్మహత్య చేసుకుంది నా భర్త కాదు.. సీరియల్ నటి క్లారిటీ
తన భర్త ఆత్మహత్య చేసుకోలేదంటూ ప్రముఖ సీరియల్ నటి, యాంకర్ రేఖ స్పష్టం చేశారు. రేఖ భర్త గోపినాథ్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇవి కాస్త ఆమె వద్దకు చేరడంతో.. తాజాగా వాటిపై స్పందించారు. సూసైడ్ చేసుకున్న వ్యక్తి భార్య పేరులో రేఖ(అసలు పేరు జెనీఫర్ రేఖ) కావడం.. ఆమె భర్త, తన భర్త పేరు గోపినాథ్ కావడంతో అందరూ తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు అనుకున్నారని ఆమె పేర్కొంది. తామిద్దరం […]
తన భర్త ఆత్మహత్య చేసుకోలేదంటూ ప్రముఖ సీరియల్ నటి, యాంకర్ రేఖ స్పష్టం చేశారు. రేఖ భర్త గోపినాథ్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇవి కాస్త ఆమె వద్దకు చేరడంతో.. తాజాగా వాటిపై స్పందించారు. సూసైడ్ చేసుకున్న వ్యక్తి భార్య పేరులో రేఖ(అసలు పేరు జెనీఫర్ రేఖ) కావడం.. ఆమె భర్త, తన భర్త పేరు గోపినాథ్ కావడంతో అందరూ తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు అనుకున్నారని ఆమె పేర్కొంది. తామిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉన్నామని.. తామిద్దరి మధ్య ఎలాంటి గొడవలు కూడా లేవని ఆమె తెలిపింది. కాగా వివాహేతర సంబంధంతో పాటు అప్పుల కారణంతో పెరంబూరు, నటరాజన్ కోవిల్ వీధికి చెందిన గోపినాథ్(39) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.