ముందే రానున్న ‘అల వైకుంఠపురములో’..?
త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, టీజర్ అందరినీ తెగ ఆకట్టుకోవడంతో.. ఈ సినిమాపై ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు తమ అంచనాలను పెంచేసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి జనవరి 12ను విడుదల తేదీగా ఖరారు చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం […]
త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, టీజర్ అందరినీ తెగ ఆకట్టుకోవడంతో.. ఈ సినిమాపై ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు తమ అంచనాలను పెంచేసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి జనవరి 12ను విడుదల తేదీగా ఖరారు చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ముందే రానున్నట్లు తెలుస్తోంది.
జనవరి 10వ తేదినే ‘అల వైకుంఠపురంలో’ను విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తి కావడంతో.. సినిమాను ముందుగానే రిలీజ్ చేయాలని బన్నీ టీమ్ భావిస్తుందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే జనవరి 9న ‘దర్బార్’, 10న ‘అల వైకుంఠపురములో’, 11న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు వరుసగా విడుదల అవ్వనున్నాయి.
కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘అల వైకుంఠపురములో’ చిత్రం తెరకెక్కింది. ఇందులో బన్నీ సరసన పూజా హెగ్డే నటించగా.. టబు, జయరామ్, నివేథా పేతురాజ్, సునీల్, నవదీప్, సుశాంత్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక జనవరి 6న హైదరాబాద్‌లో జరగనుంది.