AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ దర్శకుడికి అందుకే నో చెప్పాడట.!

టాలీవుడ్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. అందుకే టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాతలు ప్రభాస్‌తో సినిమా చేయడానికి క్యూ కడతారు. అయితే తాజాగా ఓ స్టార్ డైరెక్టర్‌కు ప్రభాస్ షాక్ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ తెరకెక్కించిన దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రభాస్‌తో ఓ సినిమా చేయనున్నాడని ఈ […]

ఆ దర్శకుడికి అందుకే నో చెప్పాడట.!
Ravi Kiran
|

Updated on: Dec 31, 2019 | 7:48 AM

Share

టాలీవుడ్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. అందుకే టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాతలు ప్రభాస్‌తో సినిమా చేయడానికి క్యూ కడతారు. అయితే తాజాగా ఓ స్టార్ డైరెక్టర్‌కు ప్రభాస్ షాక్ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ తెరకెక్కించిన దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రభాస్‌తో ఓ సినిమా చేయనున్నాడని ఈ మధ్య వార్తలు జోరందుకున్నాయి. స్పై థ్రిల్లర్ కథాంశంతో కూడిన ఈ స్టోరీని డార్లింగ్‌కు వినిపించాడని తెలుస్తోంది. అయితే అనుకోని విధంగా ప్రభాస్ ఈ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేశాడట. సురేందర్ రెడ్డి వినిపించిన థ్రిల్లర్ కథ నచ్చినప్పటికీ దాన్ని పాన్ ఇండియన్ లెవెల్‌లో తెరకెక్కించే ఆస్కారం లేకపోవడంతో ప్రభాస్‌ నో చెప్పాడని సమాచారం.

కాగా, ప్రస్తుతం ప్రభాస్ ‘జాన్’ సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ జనవరి మొదటి వారంలో హైదరాబాద్‌లో మొదలు కానుంది. రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?