AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: మరోసారి అతనితో కనిపించిన సామ్.. చట్టపట్టాలేసుకు తిరుగుతున్న జంట

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యన సినిమాల కంటే ఇతర విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా డేటింగ్, రిలేషన్ షిప్ విషయాల్లో సామ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్‌లో ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లకు ఇప్పుడు మరింత బలం చేకూరింది.

Samantha: మరోసారి అతనితో కనిపించిన సామ్.. చట్టపట్టాలేసుకు తిరుగుతున్న జంట
Samantha
Rajeev Rayala
|

Updated on: Jul 09, 2025 | 11:39 AM

Share

స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే నిర్మాతగా మారింది. రీసెంట్ గానే శుభం అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఏలింది సమంత.. ఏ స్టార్ హీరో సినిమా చూసినా హీరోయిన్ గా సమంతానే ఉండేది. అయితే గతకొంతకాలంగా సమంత సినిమాలు చేయడం లేదు. మొన్నటివరకు మాయోసైటిస్ తో బాధపడిన సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అలాగే ఏడాదిపాటు సమంత సినిమాలకు బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే ఈ మధ్య సమంత మరోసారి రిలేషన్ లో ఉంది అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. త్వరలో సమంత పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సామ్ కొన్ని కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కొంది. విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభితను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు సమంత కూడా రెండో పెళ్లి చేసుకోబోతుందని టాక్ వినిపిస్తుంది. కాగా దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తుందని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో రాజ్ నిడిమోరు పాపులర్ అయ్యారు. ఈ మధ్యకాలంలో సమంత, రాజ్ నిడిమోరు కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దాంతో ఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.

ఇవి కూడా చదవండి

తాజాగా మరోసారి సమంత రాజ్ తో కలిసి కనిపించింది. ఈ ఇద్దరూ కలిసి విదేశాల్లో పర్యటిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అమెరికాలోని డెట్రాయిట్ లో సామ్, రాజ్ కలిసి చట్టపట్టాలేసుకు తిరుగుతూ కనిపించారు. దాంతో సమంత, రాజ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు అనే వార్తలకు మరింత బలం వచ్చింది. దీని పై ఇప్పటి వరకు సమంత కానీ రాజ్ నిడిమోరు కానీ స్పందించలేదు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్