Salman Khan BIGGEST deal : భారీ డీల్ ను సెట్ చేసిన సల్మాన్ ఖాన్.. `రాధే’ను ఎంతకు విక్రయించారంటే..
కరోనా సమయంలో సినిమా ఇండస్ట్రీ చాలా ఇబ్బందులు ఎదురుకోంది. కరోన కల్లోలంలో అసలు ప్రేక్షకులు దియేటర్స్ కు వస్తారా...

Salman Khan BIGGEST deal : కరోనా సమయంలో సినిమా ఇండస్ట్రీ చాలా ఇబ్బందులు ఎదురుకోంది. కరోన కల్లోలంలో అసలు ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రముఖ నిర్మణ సంస్థతో ఓ భారీ డీల్ ను సెట్ చేసుకున్నాడని తెలుస్తుంది.
సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో `రాధే’ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థకు రూ. 230 కోట్లకు విక్రయించారని తెలుస్తుంది. శాటిలైట్, థియేట్రికల్.. రైట్స్ సహా డిజిటల్ హక్కులు మ్యూజిక్ హక్కులను మొత్తంగా కలుపుకొని రూ. 230 కోట్లకు డీల్ సెట్ చేసుకున్నారని తెలుస్తుంది. కరోనా సమయంలో జరుగుతున్న అతి పెద్ద డీల్ ఇది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా మంచి వసూళ్లను రాబడుతుందని సదారుసంస్థ భావిస్తుంది. ఇక రాధే`లో దిషా పటాని కథానాయికగా నటించగా, రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం కొరియన్ ఫిల్మ్ కి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాతో పాటు ‘ఈద్’ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది, అలాగే`యాంటిమ్: ది ఫైనల్ ట్రూత్` అనే సినిమాకూడా చేస్తున్నాడు సల్మాన్. ఇక మార్చి 2021 నుండి `టైగర్ 3` సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు సల్మాన్.
