‘బిగ్‏బాస్’ హౌస్‏లోకి వెళ్ళి మరీ కంటెస్టెంట్‏ను తిట్టిన తల్లి.. తనతో ఎందుకు క్లోజ్‏గా ఉంటున్నావంటూ..

డిసెంబర్ 20న తెలుగు బిగ్‏బాస్ సీజన్ 4 ముగిసిన విషయం తెలిసిందే. అటు తమిళ బిగ్‏బాస్ షో కూడా ముగింపు దశకు వచ్చింది. ఈ క్రమంలో ఇంట్లోని కంటెస్టెంట్లకు తమ కుటుంబ సభ్యులను

'బిగ్‏బాస్' హౌస్‏లోకి వెళ్ళి మరీ కంటెస్టెంట్‏ను తిట్టిన తల్లి.. తనతో ఎందుకు క్లోజ్‏గా ఉంటున్నావంటూ..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 30, 2020 | 2:02 PM

డిసెంబర్ 20న తెలుగు బిగ్‏బాస్ సీజన్ 4 ముగిసిన విషయం తెలిసిందే. అటు తమిళ బిగ్‏బాస్ షో కూడా ముగింపు దశకు వచ్చింది. ఈ క్రమంలో ఇంట్లోని కంటెస్టెంట్లకు తమ కుటుంబ సభ్యులను కలిసే అవకాశాన్నిచ్చారు బిగ్‏బాస్. అయితే తెలుగులో చేసినట్టు కాకుండా డైరెక్టుగా తమ వాళ్ళను కలిసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక తమ వాళ్ళను చూసిన ఆనందంలో హౌస్‏మేట్స్ తెగ సంబరపడిపోయారు. ఈ క్రమంలోనే తమిళ నటి బిగ్‏బాస్ హౌస్‏మేట్ శివాని తల్లి కూడా ఇంట్లోకి ఎంటర్ అయ్యింది. తల్లి చూడగానే శివాని ఆనందంతో పొంగిపోయింది.. కానీ తన తల్లి మందలించడంతో కాస్తా ముఖ కవలికలు మారిపోయాయి.

బుల్లి తెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న శివాని బిగ్‏బాస్ ఇంట్లోకి ప్రవేశించాక.. కొందరితో క్లోజ్‏గా ఉంటూ.. మరికొందరితో ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ ఉంది. ఆమె ఇంట్లో ఉన్న మరో కంటెస్టెంట్ బాలాజీతో ఎక్కువ సన్నిహితంగా ఉంటుంది. ఆరి అనే మరో కంటెస్టెంట్‏తో ఎప్పుడు గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయంపై తెగ కామెంట్స్ వస్తున్నాయి. శివాని ప్రవర్తనలో వచ్చిన మార్పు గురించి తల్లి తనతో మాట్లాడింది. బాలాజీతో ఎందుకు క్లోజ్‏గా ఉంటున్నావు. నీ గేమ్ నువ్వు ఆడలేవా ?.. ఆరితో ఎందుకు గొడవలు పెట్టుకుంటున్నావు అని శివాని మందలించింది. దీంతో శివాని తల్లి మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్‏గా మారాయి.