Bigg Boss4 2020 Round Up : వైల్డ్ కార్డ్ తో ముగ్గురు ఎంట్రీ ఇచ్చారు.. అనారోగ్యంతో ఇద్దరు ఎగ్జిట్ అయ్యారు..
ఈ ఏడాది కరోనా కల్లోలంలోనువు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ముందుకు వచ్చింది బిగ్ బాస్ రియాలిటీ షో. ఇప్పటికే తెలుగులో మూడు సీజన్స్ ను పూర్తి చేసుకున్న ఈ గేమ్ షో..
Bigg Boss4 2020 Round Up : ఈ ఏడాది కరోనా కల్లోలంలోనూ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ముందుకు వచ్చింది బిగ్ బాస్ రియాలిటీ షో. ఇప్పటికే తెలుగులో మూడు సీజన్స్ ను పూర్తి చేసుకున్న ఈ గేమ్ షో విజయవంతంగా నాలుగో సీజన్ ను కూడా పూర్తి చేసింది. మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి అదరగొట్టారు. అదేవిధంగా రెండొవ సీజన్ కు హీరో నాని తనదైన స్టైల్ లో హోస్ట్ గా వ్యవహరించి అలరించారు. ఇక మూడో సీజన్ కు మన్మధుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ మూడు సీజన్స్ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాయి.
అయితే నాలుగో సీజన్ లో హోస్ట్ గా ఎవరు వస్తారా అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూసారు. కానీ అనుకోకుండా కరోనా ఎంట్రీ ఇచ్చింది. అసలు బిగ్ బాస్ షో ఈ ఏడాది ఉంటుందా .. లేక కరోనా కారణంగా ఈ ఏడాదికి బ్రేక్ ఇస్తారా అన్న అనుమానాలు తలెత్తాయి. కానీ అందరికి షాక్ ఇస్తూ తెలుగులో కరోనా సమయంలో కింగ్ నాగార్జున దైర్యం చేసి బిగ్ బాస్ సీజన్ 4ను ప్రారంభించారు. ఇక హౌస్ లోకి పదహారు మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. మోనాల్, అభిజీత్, అఖిల్, సోహెల్, హారిక, దేవి నాగవల్లి, జోరుదార్ సుజాత, అరియనా,నోయల్, లాస్య, మెహబూబ్, అమ్మరాజశేఖర్, కరాటే కళ్యాణి, సూర్య కిరణ్, దివి, గంగవ్వ ఇలా పదహారు మంది హౌస్ లోకి వచ్చారు. ఇక మొదట్లో చప్పగా సాగిన ఈ షో రానురాను ఊపందుకుంది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, అల్లర్లు, లవ్ ట్రాక్ లు, డైన్స్ లు, గ్లామర్ షోలతో బిగ్ బాస్ 4 మంచి రసవత్తరంగా సాగింది.
ఇక ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వస్తున్న నేపథ్యంలో వైల్డ్ కార్డు ద్వారా కొందరు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో ముందుగా వచ్చింది. నటుడు కుమార్ సాయి. కుమార్ సాయి హౌస్ లో బాగానే ఆడాడు. మధ్యలో హౌస్ లోకి రావడంతో ముందునుంచి ఉన్న అందరు అతడిని టార్గెట్ చేయడం, నామినేట్ చేయడంతో అతడు ఏమినేషన్ కు నామినేట్ అయ్యాడు. ప్రేక్షకులనుంచి ఓట్లు తక్కువ రావడంతో అతడు హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు. అదేవిధంగా సెకండ్ వైల్డ్ కార్డు ఎంట్రీ గా వచ్చింది అందాల భామ స్వాతి దీక్షిత్. ఈ బ్యూటీ ఎక్కువ రోజులు హౌస్ లో ఉండలేకపోయింది. వారం రోజుల్లోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.
ఇక మూడో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు జబర్ధస్ అవినాష్. అవినాష్ తనదైన కామెడీ తో హౌస్ లో ఉన్నవారిని అలాగే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చివరిలో అరియానాతో పులిహోర కలుపుతూ అలరించాడు. చాలాసార్లు అవినాష్ సింపథీతో గేమ్ ఆడుతూ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. కానీ చివరకు హౌస్ నుంచి బయటకు రాక తప్పలేదు. ఇలా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ముగ్గురు చివరి వరకు హౌస్ లో ఉండలేక పోయారు.
ఇక హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వకుండా బయటకు వచ్చారు గంగవ్వ, నోయల్. పల్లెటూరు మనిషి గంగవ్వ హౌస్ లోకి వచ్చిన దగ్గరనుంచి తనదైన మాటలతో పలకరింపులతోటి అందరిని ఆకట్టుకుంది. కానీ మట్టిమనిషి గంగవ్వ ఆ ఏసీ గాలిమధ్య ఇమడలేక పోయింది. అనారోగ్య సమస్యల కారణంగా హౌస్ లో ఉండలేక పోతున్న బిడ్డా బయటకు పోతా అంటూ వేడుకుంది. వైద్యుల ఆమెను స్పెషల్ రూమ్ లో ఉంది చికిత్సను అందించారు. వైద్యులు పరీక్షించిన తర్వాత మరో సారి హౌస్ లోకి పంపించారు. కానీ ఎక్కువ రోజులు హౌస్ లో ఆమె ఉండలేక పోయారు. ఆ తర్వాత సింగర్ కమ్ యాక్టర్ నోయల్ హౌస్ నుంచి అనారోగ్య సమస్యల కారణంగా బయటకు వచ్చేసాడు. ఇక టాప్ 5లో నిలించి ఐదుగురిలో అభిజీత్, అఖిల్, సోహెల్ టాప్ 3 గా నిలిచారు. ఇక అభిజీత్ బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ కాగా అఖిల్ రన్నరప్ గా నిలిచాడు.
also read :