AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Movie : సల్మాన్ రాధే మూవీ సరికొత్త రికార్డు.. 65 దేశాల్లో అందుబాటులోకి రానున్న సినిమా..

సెకండ్ వేవ్‌ టైమ్‌లో రిలీజ్‌ అయిన భారీ కమర్షియల్ మూవీ రాధే. సల్మాన్‌ ఖాన్ లాంటి టాప్‌ హీరో నటించిన ఈ సినిమా హైబ్రిడ్‌ రిలీజ్ అనే కొత్త ట్రెండ్ తీసుకువచ్చింది.

Radhe Movie : సల్మాన్ రాధే మూవీ సరికొత్త రికార్డు.. 65 దేశాల్లో అందుబాటులోకి రానున్న సినిమా..
Radhe Movie
Rajeev Rayala
|

Updated on: May 26, 2021 | 2:56 PM

Share

Radhe Movie :

సెకండ్ వేవ్‌ టైమ్‌లో రిలీజ్‌ అయిన భారీ కమర్షియల్ మూవీ రాధే. సల్మాన్‌ ఖాన్ లాంటి టాప్‌ హీరో నటించిన ఈ సినిమా హైబ్రిడ్‌ రిలీజ్ అనే కొత్త ట్రెండ్ తీసుకువచ్చింది. అంటే థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ఒకేసారి రాధేను రిలీజ్ చేశారు. భారీ హైప్‌తో డిజిటల్ వ్యూస్‌ భాగానే వచ్చినా.. సినిమాకు నెగెటివ్ టాకే వచ్చింది. అయినా… రాధే జోరు మాత్రం తగ్గటం లేదు. తాజాగా ఈ సినిమా మరో రేర్‌ ఫీట్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే థియేటర్లతో పాటు జీ5, జీప్లెక్స్ ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌లో రిలీజ్ అయ్యింది రాధే. నెక్ట్స్ యాపిల్ టీవీలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‌కు ప్లాన్ చేస్తున్నారు. యాపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతున్న తొలి బాలీవుడ్ మూవీ కూడా రాధేనే. ఈ ప్లాట్‌ ఫామ్‌లో 65 దేశాల్లో అందుబాటులోకి రానుంది సల్మాన్ మూవీ.

దిశాపటానీ హీరోయిన్‌గా నటించిన రాధే మూవీలో డ్రగ్ మాఫియాను కంట్రోల్ చేసి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నారు సల్మాన్‌. డైరెక్టర్‌గా సల్మాన్‌తో ప్రభుదేవాకు ఇది హ్యాట్రిక్ మూవీ. గతంలో వీళ్ల కాంబోలో పోకిరీ రీమేక్ వాంటెడ్, దబ్బంగ్3 వచ్చాయి. మాస్ యాక్షన్‌తో సల్మాన్ ఫ్యాన్స్ సాటిస్‌ఫై అయినా… జనరల్ ఆడియన్స్‌ మాత్రం ఈ మాస్ మసాలా మూవీకి అస్సలు కనెక్ట్ కాలేదు. దీంతో ఈద్‌కి బ్లాక్ బస్టర్ కొడతారనుకున్న బాయ్‌జాన్‌.. అభిమానులతో పాటు ఇండస్ట్రీని కూడా నిరాశపరిచారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

నటి సోనాల్ ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. ఆమె తండ్రితో కత్తితో దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు..

Producer Annamreddy Krishna Kumar: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం.. నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్‌ గుండెపోటుతో మృతి

‘ఆర్ఆర్ఆర్’ యాక్షన్ సన్నివేశాలకు నాకు కన్నీళ్లు వచ్చాయి.. వాటిలో ఒక రకమైన బాధ దాగి ఉంది.. విజయేంద్రప్రసాద్..

Follow Us
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు