‘సాహో’ ఎఫెక్ట్.. రాజమౌళికి ఆంక్షలు..!

'సాహో' ఎఫెక్ట్.. రాజమౌళికి ఆంక్షలు..!

ఎన్నో అంచనాల మధ్య గత నెల 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ సాహో అనుకున్నంత రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అంతేకాదు బాలీవుడ్‌లో మినహాయిస్తే తెలుగు, తమిళ్‌, మలయాళ్‌లో ఈ సినిమాకు కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు. విడుదలై 20రోజులు పూర్తి అయినప్పటికీ.. కలెక్షన్లు సాధించలేక పలు చోట్ల ఫ్లాప్‌ టాక్ తెచ్చుకుంది సాహో. ఇదిలా ఉంటే ఈ ఫలితం భారీ బడ్జెట్ సినిమాలు తీసే వారికి ఒక గుణపాఠంగా మారిందన్నది విశ్లేషకుల మాట. దీంతో టాలీవుడ్‌లో […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 20, 2019 | 1:31 PM

ఎన్నో అంచనాల మధ్య గత నెల 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ సాహో అనుకున్నంత రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అంతేకాదు బాలీవుడ్‌లో మినహాయిస్తే తెలుగు, తమిళ్‌, మలయాళ్‌లో ఈ సినిమాకు కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు. విడుదలై 20రోజులు పూర్తి అయినప్పటికీ.. కలెక్షన్లు సాధించలేక పలు చోట్ల ఫ్లాప్‌ టాక్ తెచ్చుకుంది సాహో. ఇదిలా ఉంటే ఈ ఫలితం భారీ బడ్జెట్ సినిమాలు తీసే వారికి ఒక గుణపాఠంగా మారిందన్నది విశ్లేషకుల మాట. దీంతో టాలీవుడ్‌లో బడా నిర్మాతలు అప్రమత్తమయ్యారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాము నిర్మించే తదుపరి చిత్రాల్లో నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నది ఫిలిం నగర్ టాక్.

అయితే టాలీవుడ్‌ సినిమాల మార్కెట్ పెరుగుతున్న క్రమంలో భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించేందుకు ఇటీవల కాలంలో దర్శకనిర్మాతలు చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చి ఏ మాత్రం వెనుకాడకుండా ఖర్చు చేస్తున్నారు. ఇటీవల సాహో విషయంలోనూ ఇదే జరిగినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్‌కు అనుగుణంగా షూటింగ్ సమయంలో చాలా సన్నివేశాలను తెరకెక్కించారట. ఆ తరువాత నిడివి కోసం అందులో పలు సీన్లకు కత్తెర వేశారట. వాటిలో కొన్ని ఎపిసోడ్లకు భారీ ఖర్చును చేసినట్లు కూడా సమాచారం. అయితే కత్తెర పడటం వల్ల ఆ సీన్ల కోసం నిర్మాతలు పెట్టిన ఖర్చు మొత్తం బూడిదలో పోసిన పన్నీరుగా అయిపోయిందని టాక్.

ఇక సాహో ఎఫెక్ట్ తాజాగా దర్శకధీరుడు రాజమౌళిపై పడ్డట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. స్టూడెంట్ నంబర్.1తో దర్శకుడిగా ప్రయాణాన్ని ప్రారంభించిన రాజమౌళికి ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ లేదు. నిర్మాతకు ముందుగా ఇచ్చిన మాట ప్రకారం షూటింగ్ పూర్తి చేయరన్న విమర్శ ఉన్నప్పటికీ.. ఔట్‌పుట్‌ను గొప్పగా ఇస్తారన్న ప్రశంస కూడా టాలీవుడ్‌లో ఉంది. అంతేకాదు ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టాయి. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన బాహుబలి దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనాలు సృష్టించిందో అందరూ చూశారు. కానీ ఇప్పుడు సాహో ప్రభావంతో ఆయనపై నిర్మాతలు ఆంక్షలు పెడుతున్నారట.

ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ఆర్ఆర్ఆర్ తెరకెక్కిస్తుండగా.. ఆ మూవీని నిర్మిస్తున్న దానయ్య ఆయనకు కొన్ని రిస్టిక్షన్స్ పెడుతున్నారట. సినిమా నిడివికి అనుగుణంగానే సన్నివేశాల షూటింగ్‌ను ప్లాన్ చేయాలని దానయ్య, రాజమౌళికి చెప్పారట. అందుకే రాజమౌళి ఈ సినిమాలో మూడు పాటలను మాత్రమే పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు స్క్రిప్ట్‌కు అనుగుణంగా ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడనంటూనే.. ఇప్పుడు ప్రతి విషయాన్ని దానయ్య దగ్గరుండి చూసుకుంటున్నట్లు టాక్. ఇక ఇది కాస్త రాజమౌళికి ఇబ్బంది అవుతుండటంతో.. భవిష్యత్‌లో భారీ బడ్జెట్ సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu