AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రహాంతరవాసులపై అదిరిపోయే ఇన్ఫర్మేషన్… తెలిస్తే షాక్ అవడం ఖాయం.. !!

గ్రహాంతర వాసుల గురించి అక్కడ ఇక్కడ చదవడం, వినడం, సినిమాల్లో చూడడం తప్పితే ఇదమిత్తంగా వారి గురించి మనకు తెలిసింది చాల తక్కువ. అసలున్నారా లేరా అని సూటిగా అడిగితే వచ్చే సమాధానం మాత్రం “ఏమో” అనే. అలంటి సమయంలో అమెరికన్ నావికా దళం వెల్లడించిన సమాచారం నిజంగానే ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటివరకు భూమిపై మాత్రమే జీవరాశి ఉంది అని తెలిసిన మనకి ఇతర గ్రహాల్లో లేదా వేరే సౌరకుటుంబంలో జీవం ఉందా లేదా…. ఉంటే వారు […]

గ్రహాంతరవాసులపై అదిరిపోయే ఇన్ఫర్మేషన్... తెలిస్తే షాక్ అవడం ఖాయం.. !!
Rajesh Sharma
| Edited By: Ram Naramaneni|

Updated on: Sep 20, 2019 | 8:10 PM

Share

గ్రహాంతర వాసుల గురించి అక్కడ ఇక్కడ చదవడం, వినడం, సినిమాల్లో చూడడం తప్పితే ఇదమిత్తంగా వారి గురించి మనకు తెలిసింది చాల తక్కువ. అసలున్నారా లేరా అని సూటిగా అడిగితే వచ్చే సమాధానం మాత్రం “ఏమో” అనే. అలంటి సమయంలో అమెరికన్ నావికా దళం వెల్లడించిన సమాచారం నిజంగానే ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటివరకు భూమిపై మాత్రమే జీవరాశి ఉంది అని తెలిసిన మనకి ఇతర గ్రహాల్లో లేదా వేరే సౌరకుటుంబంలో జీవం ఉందా లేదా…. ఉంటే వారు మనకన్నా తెలివైన వారా లేదా కంటికి కూడా కనిపించని చిన్న క్రిముల లాగా ఉంటారా…. అని ఎన్నో సందేహాలు ఉండేవి. ఎక్కడినుండి వచ్చాయో తెలియదు గానీ గత కొద్ది సంవత్సరాలుగా గ్రహాంతరవాసులు భూమిపైన వారి వాహనాలు అనగా యు.ఎఫ్.ఓ లు వేసుకొని తిరుగుతున్నట్లు కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. సాసర్ లాగా ఉండే వాటి ఆకారం మనందరికీ తెలిసిందే. అయితే అవి ఒట్టి కల్పిత రూపాలా లేక నిజమా అన్నది ఇప్పటికీ ప్రతి ఒక్కరికి సందిగ్ధమే.

కానీ ఇకపై కాదు. ఇప్పుడు అమెరికన్ నావికా దళం విడుదల చేసిన స్టేట్మెంట్ ప్రకారం ఇప్పటి వరకు విడుదలైన మూడు వీడియోలలో కనిపించినవి యు ఎఫ్ ఓ లేనట. వారు చెప్పినది ఏమిటంటే ఈ వీడియోలు తాము ఎన్నటికీ బయటకు రాకూడదు అని అనుకున్నామని…. లేకపోతే దురదృష్టవశాత్తు అవి కాస్తా లీక్ కాగా ఇప్పుడు వాటిని నిర్ధారించాల్సిన అవసరం వచ్చిందని వారు అన్నారు. అమెరికా కు చెందిన ఒక మీడియా సంస్థ గాల్లో ఎగిరే యు.ఎఫ్.ఓ ల పై ఇన్నిరోజులు వాటిపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో యూ.ఎస్ నావికా దళం సరికొత్త ప్రయోగంగా వీటిని ప్రయోగించి ఉంటుందని సందేహాలు వ్యక్తం చేశారు.

ఇక ఈ విషయంపై తప్పనిపరిస్థితుల్లో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్న నావికా దళం అవి తమకి సంబంధించినవి కాదని…. మన భూమికి వాటికి ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించారు. ఇకపోతే విడుదలైన వీడియోలలో 2004లో క్యాలిఫోర్నియా తీరంలో కనపడిన ఒక యు.ఎఫ్.ఓ భూమి నుండి 60 వేల అడుగుల ఎత్తు నుండి 50 అడుగుల కు రెప్పపాటులో వచ్చి సముద్రంలో ఫుట్బాల్ మైదానం అంత అలజడి సృష్టించింది. కాబట్టి మొట్టమొదటి సారి గ్రహాంతరవాసులు ఉన్నారు అన్న విషయం పై నిర్ధారణ వచ్చేసిందన్నమాట. లేకపోతే ఎవరికీ చెందని విమానాలు గాలిలో అత్యాధునిక సాంకేతికతతో తిరగడం ఏమిటి? ఇక మిగిలింది వారిని వెతకడమే. మరి ఈ దిశగా తొలి అడుగులు వేసేది ఏ దేశం ? అమెరికానా ? లేక రష్యా నా ? ఈ రెండు దేశాలకు సవాళ్లు విసురుతున్న చైనా నా ? తొందరెందుకు త్వరలోనే తేలడం ఖయాం. జస్ట్ వెయిట్ అండ్ సీ… !!