భారీగా బ్యాగ్.. తెరిచి చూస్తే కళ్ళు తిరిగే కరెన్సీ !

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ బంగారం, విదేశీ కరెన్సీ రవాణాకు అడ్డాగా మారుతోందా ? ఆల్మోస్ట్ ప్రతి రోజు పట్టుబడుతున్న బంగారం, ఫారిన్ కరెన్సీ కేసులను చూస్తే అవుననే అనిపిస్తోంది.  హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. శుక్రవారం ఉదయం అబుదాబి నుంచి వచ్చిన హబీబ్‌ అలీ అల్కాప్‌ అనే వ్యక్తిని తనిఖీ చేయగా అతడి బ్యాగులో 45వేల సౌదీ రియాల్స్‌ బయటపడ్డాయి. ఇండియన్‌ కరెన్సీలో రూ.8 లక్షల 57 వేలు ఉంటుందని అధికారులు […]

భారీగా బ్యాగ్.. తెరిచి చూస్తే కళ్ళు తిరిగే కరెన్సీ !
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 20, 2019 | 7:52 PM

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ బంగారం, విదేశీ కరెన్సీ రవాణాకు అడ్డాగా మారుతోందా ? ఆల్మోస్ట్ ప్రతి రోజు పట్టుబడుతున్న బంగారం, ఫారిన్ కరెన్సీ కేసులను చూస్తే అవుననే అనిపిస్తోంది.  హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. శుక్రవారం ఉదయం అబుదాబి నుంచి వచ్చిన హబీబ్‌ అలీ అల్కాప్‌ అనే వ్యక్తిని తనిఖీ చేయగా అతడి బ్యాగులో 45వేల సౌదీ రియాల్స్‌ బయటపడ్డాయి. ఇండియన్‌ కరెన్సీలో రూ.8 లక్షల 57 వేలు ఉంటుందని అధికారులు తెలిపారు. నగదును స్వాధీనం చేసుకున్న సీఐఎస్‌ఎఫ్‌, కస్టమ్స్‌ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండ్రోజుల క్రితం కూడా ఒక మహిళా నుంచి భారీ ఎత్తున సౌదీ రియళ్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒకే వారంలో ఇది మూడో కేసు అని అధికారులు వెల్లడించారు.