‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అప్‌డేట్ ఇచ్చేసిన సినిమాటోగ్రాఫర్‌

టాలీవుడ్ యంగ్‌ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి నటిస్తోన్న మొదటి చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం). దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

'ఆర్‌ఆర్‌ఆర్‌' అప్‌డేట్ ఇచ్చేసిన సినిమాటోగ్రాఫర్‌

RRR Shooting update: టాలీవుడ్ యంగ్‌ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి నటిస్తోన్న మొదటి చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం). దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా అన్నీ కుదిరి ఉంటే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ కరోనా రావడం, లాక్‌డౌన్ విధించడం, షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో.. మూవీ విడుదల వాయిదా పడనుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్‌ ఇప్పటికే 70శాతం పూర్తి అయ్యిందని అన్నారు సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్‌.

”మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించే సమయానికి ఆర్‌ఆర్‌ఆర్‌కి సంబంధించిన 70శాతం ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. షూటింగ్‌ అయిన దానికి ఎడిటింగ్‌ పనులు కూడా ఎప్పటికప్పుడు జరిగాయి, ఇప్పటివరకు డబ్బింగ్‌ కూడా పూర్తి అయ్యింది” అని సెంథిల్‌ అన్నారు. ఇక జూలైలోనే సెట్స్ మీదకు వెళ్లాలనుకున్నప్పటికీ.. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో షూటింగ్‌ను ప్రారంభించలేదని ఆయన తెలిపారు. ఒకటి లేదా రెండు నెలల్లో ఆర్ఆర్‌ఆర్‌ షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్లు ఆయన వివరించారు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్‌ భామ అలియా భట్‌తో పాటు హాలీవుడ్‌ నటులు కూడా భాగం అవ్వడంతో.. వారు ఇక్కడకు వచ్చిన తరువాతే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Read This Story Also: Dil Bechara: ఆ పాటని పూర్తి చేస్తానన్న రెహమాన్‌

Click on your DTH Provider to Add TV9 Telugu