బాల‌య్య గొప్ప మ‌న‌సు..ఇండస్ట్రీలోని 24 విభాగాల వారికి మెడిసిన్

బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి వేదికగా ఎంతోమంది పేదలకు ఫ్రీగా వైద్యం అందిస్తున్న బాల‌య్య‌.. కరోనా ప్రారంభంలో కూడా విరాళాలు ఇచ్చి ఇండస్ట్రీలోని కార్మికుల‌కు అండ‌గా నిలిచారు.

బాల‌య్య గొప్ప మ‌న‌సు..ఇండస్ట్రీలోని 24 విభాగాల వారికి  మెడిసిన్
Follow us

|

Updated on: Jul 26, 2020 | 5:06 PM

vv vinayak thanks to balakrishna : టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు కోపం చాలా ఎక్కువ‌ని బ‌య‌ట టాక్ ఉంది. కానీ ఇది ఆయ‌న గురించి తెలియ‌ని వాళ్లు చెప్పే మాట అని..బాల‌య్య‌తో ద‌గ్గ‌రిగా మెలిగితే ఆయ‌న‌ వెన్న లాంటి మ‌న‌సు గురించి తెలుస్తుంద‌ని ఇండ‌స్ట్రీ జ‌నాలు చెబ‌తుంటారు. నిజంగానే బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి వేదికగా ఎంతోమంది పేదలకు ఫ్రీగా వైద్యం అందిస్తున్న బాల‌య్య‌.. కరోనా ప్రారంభంలో కూడా విరాళాలు ఇచ్చి ఇండస్ట్రీలోని కార్మికుల‌కు అండ‌గా నిలిచారు. అంతేకాదు..వారి ర‌క్ష‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన 24 విభాగాల వారికి మెడిసిన్ పంపార‌ట‌. ఈ విషయాన్ని దర్శకుడు వి.వి.వినాయక్‌ అభిమానులతో పంచుకున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి: కుమార్తెల‌తో కాడి మోయిస్తూ రైతు వ్య‌వ‌సాయం..చ‌లించిపోయిన సోనూసూద్..

“ప్ర‌జంట్ అన్ని చోట్లా క‌రోనా మ‌హమ్మారి విరుచుకుప‌డుతుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బసవతారకం ఆస్పత్రి ద్వారా హోమియో మెడిసిన్, విటమిన్‌ ట్యాబ్లెట్లను బాలయ్య‌ నాకు పంపారు. కేవలం నా ఒక్క‌డికి మాత్ర‌మే కాదు. సినీ ఇండ‌స్ట్రీకి చెందిన 24 విభాగాల వారికి పంపిస్తున్నారు. నన్ను గుర్తుపెట్టుకుని మరీ మెడిసిన్ పంపిన బాలకృష్ణకు థ్యాంక్స్ ” అని వి.వి.వినాయక్ పేర్కొన్నారు.

ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో బాల‌య్య‌ నటిస్తున్నారు. ఇటీవల బాలయ్య బ‌ర్త్ డే సందర్భంగా ‘బీబీ3 ఫస్ట్‌ రోర్’ రిలీజ్ చేయ‌గా విశేష స్పంద‌న వ‌చ్చింది. కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడగానే సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.