Dil Bechara: ఆ పాటని పూర్తి చేస్తానన్న రెహమాన్‌

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం‌ దిల్‌ బేచారా జూలై 24న ఆన్‌లైన్‌లో విడుదలైన విషయం తెలిసిందే. ట్రాజెడీ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీపై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి.

Dil Bechara: ఆ పాటని పూర్తి చేస్తానన్న రెహమాన్‌
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2020 | 5:59 PM

AR Rahman on unreleased Song: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం‌ దిల్‌ బేచారా జూలై 24న ఆన్‌లైన్‌లో విడుదలైన విషయం తెలిసిందే. ట్రాజెడీ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీపై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి. సుశాంత్ అభిమానులే కాదు.. సినీ ప్రముఖులు సైతం ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా చూస్తున్నంత సేపు కన్నీళ్లు ఆగడం లేదని, ఇందులోని మ్యానీ పాత్రలో సుశాంత్‌ జీవించాడని, ఓ గొప్ప నటుడిని కోల్పోయామని.. ఇలా కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో ఓ  అభిమన్య్ వీర్(సైఫ్ అలీ ఖాన్‌) పాత్ర ఒక పాటను కంప్లీట్ చేయకపోగా.. ఈ సినిమాకు పనిచేసిన రెహమాన్ సైతం ఇందులోని ఓ పాటను పూర్తిగా విడుదల చేయలేదు. మూవీ చివర్లో వచ్చే ‘నెవర్ సే గుడ్‌బై’ అనే పాటను ఆల్బమ్‌లో ‘దిల్ బేచారా’ టీమ్‌ విడుదల చేయలేదు.

ఈ విషయాన్ని ఏఆర్‌ రెహమాన్‌తో పంచుకున్న ఓ అభిమాని.. ”సర్‌ దిల్‌ బేచారా సినిమాలో చివరి పాటను పూర్తి చేయండి” అని విఙ్ఞప్తి చేశారు. దానికి స్పందించిన రెహమాన్‌.. ”కచ్చితంగా చేస్తాను. విడుదల కానీ పాటను నువ్వు గమనించావు” అని కామెంట్ పెట్టారు.

Read This Story Also: నితిన్‌ మ్యారేజ్‌కి ‘రంగ్‌దే’ టీమ్‌ గిఫ్ట్‌.. అదిరిపోయిందిగా