AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie Records: మరో ఆల్ టైమ్ రికార్డ్‌పై కన్నేసిన ఆర్ఆర్ఆర్ మూవీ.. ఇంటర్నేషనల్ లెవల్‌కి జక్కన్న..

RRR Movie Updates: కలెక్షన్ల విషయంలో గత రికార్డులన్నిటినీ ట్రిపులార్ తిరగరాసే అవకాశముందన్న అంచనాలున్నాయి.  ఆల్‌ టైమ్‌ హయ్యస్ట్‌ గ్రాసర్‌గా ట్రిపులార్ నయా రికార్డ్ సెట్ చేస్తుందా? ఇదే ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో మోస్ట్ ఇంట్రస్టింగ్ డిస్కషన్‌ జరుగుతోంది. 

RRR Movie Records: మరో ఆల్ టైమ్ రికార్డ్‌పై కన్నేసిన ఆర్ఆర్ఆర్ మూవీ.. ఇంటర్నేషనల్ లెవల్‌కి జక్కన్న..
RRR Movie
Janardhan Veluru
|

Updated on: Jul 23, 2022 | 3:19 PM

Share

RRR Movie Collections Record:నేషనల్‌ వైడ్‌గా ఈ రేంజ్‌ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నRRR మూవీ ఇప్పుడు గ్లోబల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో మరో చర్చ తెర మీదకు వచ్చింది. ఇప్పటి వరకు RRR కలెక్షన్లు రూ.1200 కోట్ల దగ్గర్లో ఉన్నాయి. మరి గ్లోబల్ రిలీజ్ తరువాత ఆ లెక్క మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కలెక్షన్ల విషయంలో గత రికార్డులన్నిటినీ ట్రిపులార్ తిరగరాసే అవకాశముందన్న అంచనాలున్నాయి.  ఆల్‌ టైమ్‌ హయ్యస్ట్‌ గ్రాసర్‌గా ట్రిపులార్ నయా రికార్డ్ సెట్ చేస్తుందా? ఇదే ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో మోస్ట్ ఇంట్రస్టింగ్ డిస్కషన్‌ జరుగుతోంది.

ట్రిపులార్ గ్లోబల్ రిలీజ్‌కు సంబంధించిన ఎనౌన్స్‌మెంట్ ఇచ్చింది మూవీ టీమ్. ముందుగా జపాన్‌లో సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. గతంలో బాహుబలి సినిమాతో జపాన్ ఆడియన్స్‌ను అభిమానులుగా మార్చేసుకున్న జక్కన్న.. ఈ సారి అక్కడి నుంచి గ్లోబల్‌ టార్గెట్ సెట్ చేశారు. అక్టోబర్ 21న ఈ సినిమా జపాన్‌లో అక్కడి లోకల్‌ లాంగ్వేజ్‌లో రిలీజ్ కానుంది.

జపాన్ తరువాత చైనా రిలీజ్ మీద దృష్టి పెట్టనున్నారు మేకర్స్‌. ఇండియన్ సినిమాకు బిగ్గెస్ట్ మార్కెట్ చైనానే. గతంలో బాహుబలి రికార్డ్ కలెక్షన్లు సాధించటం వెనుక చైనా కలెక్షన్లది మేజర్‌ రోల్‌. అందుకే ట్రిపులార్‌, చైనా రిలీజ్ కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

జపాన్, చైనాల్లోనూ RRR మూవీకి పాజిటివ్‌ టాక్‌ వస్తే… ఇండియన్ సినిమాలో మరో ఆల్‌ టైమ్‌ హయ్యస్ట్ కలెక్షన్ల రికార్డ్ ఖాయం అన్న అంచనా వేస్తున్నారు క్రిటిక్స్‌. బాహుబలి ఓవరాల్‌గా రూ.1800 కోట్ల మార్క్‌ను టచ్‌ చేసింది. ఆ తరువాత ఆమీర్‌ ఖాన్ దంగల్‌ మూవీ చైనా రిలీజ్‌తో ఆ రికార్డ్‌ను బ్రేక్‌ చేసి రూ.2000 కోట్ల రికార్డ్ సెట్ చేసింది .

ఇప్పుడు ట్రిపులార్ గ్లోబల్‌ రిలీజ్‌ అప్‌డేట్ రావటంతో ఈ మూవీ దంగల్ రికార్డ్‌ను బ్రేక్‌ చేసి న్యూ స్టాండర్డ్ సెట్‌ చేస్తుందా? అన్న డిస్కషన్ మొదలైంది. ఒకవేళ అదే జరిగితే… ఇంటర్నేషనల్ లెవల్‌లో రాజమౌళి పేరు మరోసారి మారుమోగటం ఖాయం అంటున్నారు టాలీవుడ్ సినీ జనాలు.

మరిన్ని సినిమా వార్తలు చదవండి..