RRR Movie: ట్రిపులార్‌ బ్రిడ్జ్‌ సీన్‌ కోసం ఇంత కష్టపడ్డారా.. వీడియో చూస్తే ఔరా అనాల్సిందే..

RRR Movie: ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా సృష్టించిన సంచలనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ఇండియన్‌ సినీ ఇండస్ట్రీలో ఓ అద్భుతాన్ని సృష్టించింది. రాజమౌళి అద్భుత దర్శకత్వ ప్రతిభ...

RRR Movie: ట్రిపులార్‌ బ్రిడ్జ్‌ సీన్‌ కోసం ఇంత కష్టపడ్డారా.. వీడియో చూస్తే ఔరా అనాల్సిందే..
Follow us
Narender Vaitla

|

Updated on: May 30, 2022 | 7:14 PM

RRR Movie: ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా సృష్టించిన సంచలనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ఇండియన్‌ సినీ ఇండస్ట్రీలో ఓ అద్భుతాన్ని సృష్టించింది. రాజమౌళి అద్భుత దర్శకత్వ ప్రతిభ, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ల మహా నటన సినిమాను విజయ తీరాలకు చేర్చింది. సినిమాలోని ప్రతీ సన్నివేశాన్ని రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించిన తీరుకు ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. ఇలా సినిమాకు హైలెట్‌గా నిలిచిన సన్నివేశాల్లో బ్రిడ్జ్‌ సీక్వెన్స్‌ ఒకటి. సినిమాలో భీమ్‌, రామ్‌ పాత్రలను కలిపేందుకు దర్శకుడు ఈ సన్నివేశాన్ని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఈ అద్భుత సన్నివేశాన్ని ఎలా తెరకెక్కించారో వివరిస్తూ ఓ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో చూస్తుంటే సన్నివేశం అంతలా అద్భుతంగా రావడానికి చిత్ర యూనిట్‌ ఎంత కష్టపడిందో అర్థమవుతోంది. ముఖ్యంగా ఈ వీడియోకు గ్రాఫిక్‌ అందించిన డెన్మార్క్‌కు చెందిన గ్రాఫిక్‌ టీమ్‌. అలాగే బ్రిడ్జి నమూనా కోసం రాజమండ్రిలోని గోదావరి బ్రిడ్జిని పరిశీలించడం, అలాగే రైలులో ఉన్న సిలిండర్‌లను తయారు చేసిన తీరును ఈ వీడియోలో వివరంగా చూపించారు. ప్రస్తుతం ఈ మేకింగ్‌ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. మరి ఈ విజువల్‌ వండర్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

ఇవి కూడా చదవండి

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే