Ante Sundaraniki: అంటే సుందరానికీ నుంచి గ్లింప్స్.. ట్రైలర్ అప్డేట్ ఇచ్చేసిన సుందర్, లీల..

సరదా వ్యక్తులైన సుందర్, లీల కలిసినప్పుడు వినోదం కచ్చితంగా ఉంటుంది.. అంటూ ఈ వీడియోను రిలీజ్ చేశారు.

Ante Sundaraniki: అంటే సుందరానికీ నుంచి గ్లింప్స్.. ట్రైలర్ అప్డేట్ ఇచ్చేసిన సుందర్, లీల..
Ante Sundaraniki
Follow us

|

Updated on: May 30, 2022 | 1:12 PM

న్యాచురల్ స్టార్ హీరో నాని (Nani) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం అంటే సుందరానికీ (Ante Sundaraniki).. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ నజ్రియా నజిమ్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీని జూన్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు గతంలోనే ప్రకటించారు మేకర్స్. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో అంటే సుందరానికీ నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేయగా.. మరోవైపు ఇందులోని పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రమోషన్లలో వేగం పెంచిన చిత్రయూనిట్ తాజాగా అంటే సుందరానికీ ట్రైలర్ గ్లింప్స్ విడుదల చేసింది.

గ్లింప్స్ వీడియోను షేర్ చేస్తూ ఈ మూవీ ట్రైలర్ ను జూన్ 2న విడుదల చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. సరదా వ్యక్తులైన సుందర్, లీల కలిసినప్పుడు వినోదం కచ్చితంగా ఉంటుంది.. అంటూ ఈ వీడియోను రిలీజ్ చేశారు. ముఖ్యమైన పాత్రలను పరిచయం చేస్తూ కామెడీ టచ్ తో కూడిన సీన్ పై ఈ గ్లింప్స్ కట్ చేశారు. కామెడీ ప్రధానంగానే ఈ సినిమా ఉండనున్నట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. చూసింది చాలు అవతల నాకు చాలా పని ఉంది త్వరగా చెప్పు అంటూ హర్షవర్దన్ చెప్పే డైలాగ్ నవ్విస్తుంది. ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్‏లో కనిపించనున్న సంగతి తెలిసిందే. అలాగే మొదటిసారి నజ్రియా తెలుగులో చేస్తున్న సినిమా ఇది.. అంతేకాకుండా మొదటి సినిమాకే తెలుగులో డబ్బింగ్ చెప్పేస్తుంది నజ్రియా. ఇటీవల సినిమా షూటింగ్‌ జరుగుతోన్న సమయంలో సెట్స్‌లో చోటుచేసుకున్న ఫన్నీ సంఘటనలకు సంబంధించిన వాటినన్నింటినీ ఒకచోట చేర్చి ఈ వీడియోను షేర్ చేసి సినిమా పై క్యూరియాసిటీ పెంచేస్తుంది చిత్రయూనిట్

ఇవి కూడా చదవండి

ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్
ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్
మీ ఇంట్లో వేడిగా ఉంటోందా? ఫ్యాన్‌, కూలర్‌ లేకుండానే ఇల్లంతా కూల్‌
మీ ఇంట్లో వేడిగా ఉంటోందా? ఫ్యాన్‌, కూలర్‌ లేకుండానే ఇల్లంతా కూల్‌
అందాల ఆరబోతకు హద్దే లేదంటున్న దక్ష నాగర్కర్..
అందాల ఆరబోతకు హద్దే లేదంటున్న దక్ష నాగర్కర్..
పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంపై జనసేన పార్టీ కీలక ప్రకటన
పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంపై జనసేన పార్టీ కీలక ప్రకటన
ఇవి ఆకులే కదా అని తీసిపారేసేరు.. వీటి నీరు తాగితే అమృతమే..
ఇవి ఆకులే కదా అని తీసిపారేసేరు.. వీటి నీరు తాగితే అమృతమే..
వైఫై వేగంగా ఉండాలంటే ఈ  ప్రదేశాల్లో రౌటర్ అస్సలు ఉంచొద్దు
వైఫై వేగంగా ఉండాలంటే ఈ  ప్రదేశాల్లో రౌటర్ అస్సలు ఉంచొద్దు
హైదరాబాదీ బ్యాటర్ల పెను విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
హైదరాబాదీ బ్యాటర్ల పెను విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్..
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్..
దటీజ్ వంగా.! సందీప్ వంగా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నదెవరు.?
దటీజ్ వంగా.! సందీప్ వంగా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నదెవరు.?
త్వరలో ఢిల్లీకి ఎయిర్‌ట్యాక్సీ.. 30 కి.మీ దూరానికి ఏడే నిమిషాలు
త్వరలో ఢిల్లీకి ఎయిర్‌ట్యాక్సీ.. 30 కి.మీ దూరానికి ఏడే నిమిషాలు