Adivi Sesh: నేష‌న‌ల్ సెక్యూరిటీ బ్లాక్ క‌మాండో మెడ‌ల్ అందుకోవ‌డం ఆస్కార్ క‌న్నా గొప్ప‌విష‌యం.. అడ‌వి శేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసిన సంగతి తెలిసిందే.

Adivi Sesh: నేష‌న‌ల్ సెక్యూరిటీ బ్లాక్ క‌మాండో మెడ‌ల్ అందుకోవ‌డం ఆస్కార్ క‌న్నా గొప్ప‌విష‌యం.. అడ‌వి శేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Adivi Sesh
Follow us

|

Updated on: May 30, 2022 | 7:13 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ బ్యానర్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం మేజర్ (Major). 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు (Adivi Sesh). అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా చిత్ర టీమ్ ప్ర‌మోష‌న్‌ లో భాగంగా ఆదివారంనాడు వైజాగ్ ప‌ర్య‌టించారు. ముందుగా సినిమాను ప్ర‌ద‌ర్శించి ఆ త‌ర్వాత ప్రీరిలీజ్ చేయ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ మీడియా స‌మావేశంలో ప‌లు విష‌యాల‌ను తెలియ‌జేశారు.

అడ‌వి శేష్ మాట్లాడుతూ… ” ప్రీరిలీజ్ ఈవెంట్ వైజాగ్‌ లో చేయ‌డం చాలా ఆనందంగా వుంది. ఇంత‌కు ముందు ఎవ‌రు, గూఢ‌చారి సినిమాలు హిట్ అవ్వాల‌ని తీశాం. కానీ మేజ‌ర్ సినిమా మాత్రం సందీప్ జీవితం అంద‌రికీ రీచ్ కావాల‌నే తీశాం. నేను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌ లో సినిమా చేస్తుండ‌గా బ్రేక్ ఇచ్చి ఈ సినిమా చేశాం. ప్ర‌మోష‌న్ బెట‌ర్‌ గా వుండాల‌ని అంద‌రికీ సినిమా చూపించాల‌నే నిర్ణ‌యం తీసుకున్నాం. ఇండియ‌న్ ఫిలిం హిస్ట‌రీలో సినిమా విడుద‌ల‌కు 10 రోజులు ముదుగా 10 సిటీల‌లో ఇలా సినిమా చూపించ‌డం గొప్ప విష‌యం. ఒక‌వైపు పైర‌సీని నియంత్రించేవిధంగా చ‌ర్య‌లు తీసుకుంటూ సినిమా చూపించాం. మొద‌ట ఇలా చేయాల‌ని పూనెలో ప్ర‌క‌టించిన‌ప్పుడు బుక్‌ మై షో టికెట్ల బుకింగ్ పెట్టాం. అక్క‌డ మేజ‌ర్ కల్నల్ ఫ్యామిలీ వ‌చ్చింది. వారు చూశాక `ఇది క‌దా సందీప్ స్టోరీ` అన్నారు. నాకు గూస్ బంప్స్ వ‌చ్చాయ‌ని కల్నల్ అన్నారు. మేజ‌ర్ అనేది సినిమా కాదు ఎమోష‌న్‌. అహ్మ‌దాబాద్‌లో సినిమా చూశాక `భార‌త్ మాతాకీ జై.. మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ అమ‌ర్ ర‌హే! అంటూ నినాదాలు చేశారు.

ఇక ముంబైలో నేష‌న‌ల్ షెక్యూరిటీ గార్డ్‌ కు సినిమా చూపించాం. అందులో ట్రైనింగ్ ఆఫీస‌ర్ మేజ‌ర్ సందీప్‌. అక్క‌డ 312 కుటుంబాలు సినిమా చూశారు. కానీ అంతా నిశ్శ‌బ్ద వాతావ‌ర‌ణం నెల‌కొంది. దాంతో మాకు అనేక అనుమానాలు వ‌చ్చాయి. ఆరోజు రాత్రి 11.30గంట‌ల‌కు హెడ్ క్వార్ట‌ర్స్‌కు ర‌మ్మ‌ని మాకు ఫోన్ వ‌చ్చింది. మేకింగ్ ఏదైనా త‌ప్పుచేశామోన‌నే భ‌యంతో వెళ్ళాం. కానీ మా టీమ్‌ కు వారు ఓ మెడ‌ల్ బ‌హూక‌రించారంటూ. చూపించారు. నేష‌న‌ల్ సెక్యూరిటీ బ్లాక్ క‌మాండో మెడ‌ల్ ఇది. అక్క‌డ సందీప్ విగ్ర‌హం కూడా వుంది. ఈ మెడ‌ల్ అందుకోవ‌డం ఆస్కార్ క‌న్నా గొప్ప‌విష‌యం. ఆ త‌ర్వాత హోం టౌన్‌ లో సినిమా చూపించాల‌ని వైజాగ్ వ‌చ్చాం. ఇది సెల‌బ్రేష‌న్‌ గా ఫీల‌వుతున్నాం. ఇండియ‌న్ ఫిలిం హిస్ట‌రీలో సినిమా చూపించి ప్రీరిలీజ్ చేయ‌డం మొద‌టిసారి. ఈ సినిమా సీన్‌ టు సీన్ డైలాగ్ టు డైలాగ్ తెలుగు, హిందీలోనూ ప్రోప‌ర్‌గా తీశాం. హైద‌రాబాద్‌ లో తెలుగు వారు చేసిన ఇండియ‌న్ ఫిలిం మేజ‌ర్‌. ఇందులో న‌టించిన వారంతా తెలుగు ఓన్ డ‌బ్బింగ్ చెప్పారు” అని అన్నారు.

Latest Articles