Viral video: 4 కాళ్ళు, 4 చేతులతో ఉన్న చిన్నారి వీడియో వైరల్.. మరోసారి మానవత్వం చాటుకున్న సోనూసూద్

చిన్నారికి అదనంగా ఏర్పడిన రెండు చేతులు, రెండు కాళ్లను తొలగించి సాధారణ పిల్లల మాదిరిగా ఉండేలా చూడాలని తల్లిదండ్రులు భావించారు. అయితే వారి ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రం.

Viral video: 4 కాళ్ళు, 4 చేతులతో ఉన్న చిన్నారి వీడియో వైరల్.. మరోసారి మానవత్వం చాటుకున్న సోనూసూద్
4 Hands And 4 Legs Baby
Follow us
Surya Kala

|

Updated on: May 30, 2022 | 7:34 AM

Viral video: తల్లిదండ్రులు తమ పిల్లల క్షేమం కోసం వారు ఆరోగ్యంగా ఉండడం కోసం ఎంతో తపన పడతారు. తమ శక్తికి మించి తమ పిల్లలను కాపాడుకోవడానికి అహర్నిశలు కష్టపడతారు. ముఖ్యంగా తమ పిల్లలు ఎలా పుట్టినా సరే.. తల్లిదండ్రులు వారిని కాపాడుకోవడానికి చికిత్స చేయించి వారికీ మంచి జీవితాన్ని ఇవ్వాలని భావిస్తారు. ఓ చిన్నారి జన్యు లోపంతో రెండున్నరేళ్ల క్రితంలో వింత రూపంతో జన్మించింది. ఆ చిన్నారి పొట్ట దగ్గర అదనంగా రెండు చేతులు, రెండు కాళ్లతో జన్మించింది. చిన్నారికి అదనంగా ఏర్పడిన రెండు చేతులు, రెండు కాళ్లను తొలగించి సాధారణ పిల్లల మాదిరిగా ఉండేలా చూడాలని తల్లిదండ్రులు భావించారు. అయితే వారి ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రం. ఆర్ధిక సహాయం చేయడమని ఎవరిని కోరినా ఎవరూ ముందుకు రాకపోవడంతో రెండున్నరఏళ్లుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.. సోనూ సూద్ దృష్టికి చేరుకుంది. తాను ముందుకొచ్చి ఆ చిన్నారికి అవస్థలను తీర్చాడు. వివరాల్లోకి వెళ్తే..

బీహార్ లోని నెవాడా జిల్లా నివాసి బసంత్ పాశ్వాన్ కుమార్తె చౌముఖి. జన్యు లోపంతో  నాలుగు చేతులు, నాలుగు కాళ్ళతో చౌముఖి జన్మించింది. చిన్నారి వింత ఆకారం చూసి భయపడి ఎవరూ ఆ అమ్మాయిని దగ్గరకు రానివ్వలేదు.. ఆదుకొనేందుకు కూడా భయపడేవారట. దీంతో తల్లిదండ్రులు తమ కుమార్తె దుస్థితిని తొలగించమని అనేక మంచి సాయం కోరాడు. అయినప్పటికీ ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు. వింత ఆకారంతో తమ కూతురు పడుతున్న ఇబ్బందులు చూడలేక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఓ సారి బసంత్ పాశ్వాన్ కూతురు చౌముఖి ఎదుర్కొంటున్న సమస్యను వీడియో తీసి కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో వైరల్ గా మారి బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనుసూద్ దృష్టికి చేరుకుంది.

ఇవి కూడా చదవండి

వెంటనే చౌముఖికి అండగా తాను ఉన్నానంటూ తల్లిదండ్రులకు అభయాన్ని ఇచ్చాడు.  చిన్నారికి శస్త్ర చికిత్స చేయించేందుకు ముందుకొచ్చాడు. చిన్నారికి వైద్యం చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. చౌముఖి త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని కోరుతూ ఓ ట్వీట్ చేశారు. తమ కూతురుకి త్వరలోనే ఆపరేషన్ చేసి.. నయం చేస్తారని.. అప్పుడు తమ కూతురు అందరి పిల్లలా తిరుగుతుందని.. తోటి చిన్నారులతో కలిసి ఆడుకుంటుందని తండ్రి బసంత్ పాశ్వాన్ సంతోషంగా చెప్పారు.

సోనుసూద్ సాయం చేయడానికి ముందుకొచ్చిన తర్వాత అనేకమంది మేము కూడా చిన్నారి కుటుంబానికి అండగా ఉంటామని.. ఆర్ధికంగా ఆదుకుంటామని చెబుతున్నారు. చిన్నారి త్వరలో కోలుకోవాలని కోరుతున్నారు. అదే సమయంలో సోనుసూద్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..