Pooja Hegde: ‘యానిమల్’ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్.? క్లారిటీ ఇచ్చిన పీఆర్ టీం.. అసలు నిజమిదే!
Pooja Hegde: ఓవైపు స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోన్న సమయంలోనే స్పెషల్ సాంగ్‌లో నటించి సరికొత్త సంస్కృతికి తెర తీసింది అందాల తార పూజా హెగ్డే. హీరోయిన్‌గా కెరీర్‌లో పీక్‌లో ఉన్న సమయంలోనే రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి అంటూ అందరినీ..
Pooja Hegde: ఓవైపు స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోన్న సమయంలోనే స్పెషల్ సాంగ్‌లో నటించి సరికొత్త సంస్కృతికి తెర తీసింది అందాల తార పూజా హెగ్డే. హీరోయిన్‌గా కెరీర్‌లో పీక్‌లో ఉన్న సమయంలోనే రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి అంటూ అందరినీ అట్రాక్ట్ చేసింది. ఈ స్పెషల్ సాంగ్‌లో తన అందచెందాలతో యువతను కట్టిపడేసిందీ బ్యూటీ. ఈ సినిమా విజయంలో ఈ పాట కూడా ఓ ముఖ్య పాత్ర పోషించదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన దాదాపు ప్రతీ సినిమా విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
ఇలాంటి క్రేజ్‌లోనూ పూజా ‘ఎఫ్3’ సినిమాలో మరోసారి స్పెషల్ సాంగ్‌లో నటించి మెప్పించిందీ బ్యూటీ. ‘లైఫ్ అంటే ఇట్లా ఉండాలే’ అంటూ సాగే పాటలో మరోసారి మెస్మరైజ్ చేసింది. ఇదిలా ఉంటే ఈ చిన్నది మరోసారి ఐటెం సాంగ్‌లో నటించనుందని పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సందీప్ వంగ దర్శకత్వంలో ‘యానిమల్’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో పూజాను స్పెషల్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ సంప్రదించిందని నెట్టింట రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ కథనాలపై తాజాగా పూజా హెగ్డే పీఆర్ టీం స్పందించింది. ‘యానిమల్’ చిత్రంలో పూజా హెగ్డే ఎలాంటి స్పెషల్ సాంగ్ చేయట్లేదని.. సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ పూర్తిగా అవాస్తవం అని క్లారిటీ ఇచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..