Virata Parvam: చెప్పిన దానికంటే ముందుగానే వచ్చేస్తోన్న విరాట పర్వం.. చిత్ర యూనిట్‌ అధికారిక ప్రకటన..

Virata Parvam: రానా (Rana), సాయి పల్లవి (Sai pallavi) జంటగా తెరకెక్కిన సినిమా 'విరాట పర్వం'. 'నీది నాది ఒకే కథ' సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి...

Virata Parvam: చెప్పిన దానికంటే ముందుగానే వచ్చేస్తోన్న విరాట పర్వం.. చిత్ర యూనిట్‌ అధికారిక ప్రకటన..
Follow us
Narender Vaitla

|

Updated on: May 30, 2022 | 6:08 PM

Virata Parvam: రానా (Rana), సాయి పల్లవి (Sai pallavi) జంటగా తెరకెక్కిన సినిమా ‘విరాట పర్వం’. ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల మాత్రం వాయిదా పడుతూనే ఉంది. కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడిందీ సినిమా. ఇక ఈ సినిమా విడుదల విషయంలో జరిగినన్నీ ప్రచారాలు మరే సినిమా విషయంలో జరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకానొక సమయంలో సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే చిత్ర యూనిట్‌ మాత్రం ఈ వార్తలను ఎప్పటికప్పుడు కొట్టేస్తూ వచ్చింది.

ఈ క్రమంలోనే జూలై 1న సినిమాను విడుదల చేస్తున్నామని గతంలో చిత్ర యూనిట్‌ ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ మే 6న ప్రకటించింది. అయితే తాజాగా చిత్ర యూనిట్‌ చెప్పిన తేదీ కంటే ముందుగానే వచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయమై సోమవారం అధికారిక ప్రకటన చేశారు. జూన్‌ 17న ఈ సినిమాను ప్రేక్షకుల ముందకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. నిజానికి జూన్‌ 17న రవితేజ నటిస్తోన్న ‘రామ రావు ఆన్‌ డ్యూటీ’ విడుదల కావాల్సి ఉంది. కానీ చిత్ర యూనిట్ ఆ సినిమా విడుదలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే విరాట పర్వాన్ని జూన్‌ 17న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సిద్ధమైంది. దీంతో చాలా రోజుల నుంచి ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తోన్న మూవీ లవర్స్‌ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉంటే విరాట పర్వం చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. 1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రానా.. కామ్రేడ్ రావన్న పాత్రలో నటిస్తుండగా.. అతడి కవితలు చదివి అతడి ప్రేమ కోసం వెళ్లే యువతి వెన్నెల పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. వీరితో పాటు ఇందులో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర కీలకపాత్రలలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..