ముసలోడికి కాస్ట్యూమ్ డిజైన్ చేస్తానంటోంది: వర్మ

హైదరాబాద్: వర్మ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటారు. వివాదాస్పద పోస్టింగులు పెడుతూ నిరంతరం వార్తల్లో ఉంటారు. వివాదాస్పద అంశాలపై మాట్లాడుతూ ఎప్పుడూ వార్తల్లో ఉండే వర్మ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను మాత్రం పెద్దగా మాట్లాడడు. అలాంటిది తాజాగా సోషల్ మీడియాలో తన మేనకోడలు గురించి చెప్పారు. శ్రావ్య వర్మ తన మేనకోడలని.. ఈ ముసలోడికి కూడా కాస్ట్యూమ్ డిజైన్ చేస్తానంటోంది అంటూ చెప్పాడు వర్మ. శ్రావ్య వర్మతో కలిసి సరదాగా దిగిన ఫొటోలను సోషల్ […]

ముసలోడికి కాస్ట్యూమ్ డిజైన్ చేస్తానంటోంది: వర్మ
Follow us
Vijay K

|

Updated on: Mar 06, 2019 | 2:25 PM

హైదరాబాద్: వర్మ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటారు. వివాదాస్పద పోస్టింగులు పెడుతూ నిరంతరం వార్తల్లో ఉంటారు. వివాదాస్పద అంశాలపై మాట్లాడుతూ ఎప్పుడూ వార్తల్లో ఉండే వర్మ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను మాత్రం పెద్దగా మాట్లాడడు.

అలాంటిది తాజాగా సోషల్ మీడియాలో తన మేనకోడలు గురించి చెప్పారు. శ్రావ్య వర్మ తన మేనకోడలని.. ఈ ముసలోడికి కూడా కాస్ట్యూమ్ డిజైన్ చేస్తానంటోంది అంటూ చెప్పాడు వర్మ. శ్రావ్య వర్మతో కలిసి సరదాగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో వర్మ పోస్ట్ చేశాడు.

తనవి బైసెప్స్ అయితే నావి ట్రైసెప్స్ అంటూ వర్మ తనపైనే సెటైర్ వేసుకున్నాడు. ఈ శ్రావ్యవర్మ సినీ ప్రముఖులకు కాస్ట్యూమ్ డిజైన్ చేస్తుంది. కోలీవుడ్‌లో స్టార్లకు ఎక్కువగా పని చేస్తుంది. వర్మ సపోర్ట్‌తో మంచి ఆఫర్లు సాధిస్తూ డిజైనింగ్ రంగంలో దూసుకెళుతోంది.