లక్ష్మీస్ ఎన్టీఆర్ రెండో సాంగ్ అనౌన్స్ చేసిన వర్మ
హైదరాబాద్: లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన ఒక్కో అంశాన్ని విడుదల చేస్తూ వస్తున్న వర్మ తాజాగా మరో ప్రకటన చేశారు. మూవీ రెండో సాంగ్ విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. మార్చి 7వ తేదీ, శుక్రవారం ఉదయం 9.27 గంటలకు విడుదల చేయనున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వెన్నుపోటు లిరిక్స్‌తో వచ్చిన తొలి సాంగ్ బాగా వైరల్ అయిన నేపథ్యంలో వర్మ రెండో సాంగ్ ప్రకటించడంతో ఆసక్తి పెరిగింది. మొదటి పాటను వెన్నుపోటుపై చిత్రించిన వర్మ, రెండో […]
హైదరాబాద్: లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన ఒక్కో అంశాన్ని విడుదల చేస్తూ వస్తున్న వర్మ తాజాగా మరో ప్రకటన చేశారు. మూవీ రెండో సాంగ్ విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. మార్చి 7వ తేదీ, శుక్రవారం ఉదయం 9.27 గంటలకు విడుదల చేయనున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వెన్నుపోటు లిరిక్స్‌తో వచ్చిన తొలి సాంగ్ బాగా వైరల్ అయిన నేపథ్యంలో వర్మ రెండో సాంగ్ ప్రకటించడంతో ఆసక్తి పెరిగింది.
మొదటి పాటను వెన్నుపోటుపై చిత్రించిన వర్మ, రెండో పాటను ఎలా తెరకెక్కించారో చూడాలి. రాజకీయంగా ఈ సినిమా వివాదాస్పదంగా మారడంతో దీనికి సంబంధించి ఏం విడుదలైనా ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతోంది. పలువురు రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. రాజకీయంగా ఏం జరిగినా వర్మ తనపని తాను చేసుకుంటూ పోతున్నాడు.
ఉద్రిక్త పరిస్థితిని సనిమా హైప్‌కు వాడుకుంటూ మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. ఈ సినిమా మార్చి నెలాఖరులో విడుదలకు సిద్ధమౌతోంది. విదేశాల్లో అయితే ఈ సినిమాను ‘వీకెండ్ సినిమా’ వాళ్లు విడుదల చేయనున్నట్టు వర్మ ప్రకటించారు.
The second song of #LakshmisNTR will release tomorrow morning the 7 th at 9.27 AM
— Ram Gopal Varma (@RGVzoomin) March 6, 2019