కోల్‌కతాలో 40 రోజుల పాటు ఆర్ఆర్ఆర్ షూటింగ్

హైదరాబాద్: బాహుబలి తర్వాత రాజమౌళి చేపట్టిన మూవీ ఆర్ఆర్ఆర్ కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తుండటంతో మరింతగా హైప్ పెరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కామ్‌గా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఫిల్మ్ సిటీలో షూటింగ్ ముగియడంతో చిత్ర బృందాన్ని రాజమౌళి కోల్‌కతాకు తీసుకెళుతున్నారట. అక్కడ కీలక సన్నివేశఆలను చిత్రించనున్నారట. ముఖ్యంగా హౌరా బ్రిడ్జ్‌పై కొన్ని యాక్షన్ సీన్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం. స్వాతంత్ర్యానికి పూర్వ పరిస్థితుల […]

కోల్‌కతాలో 40 రోజుల పాటు ఆర్ఆర్ఆర్ షూటింగ్
Follow us

|

Updated on: Mar 06, 2019 | 1:26 PM

హైదరాబాద్: బాహుబలి తర్వాత రాజమౌళి చేపట్టిన మూవీ ఆర్ఆర్ఆర్ కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తుండటంతో మరింతగా హైప్ పెరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కామ్‌గా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఫిల్మ్ సిటీలో షూటింగ్ ముగియడంతో చిత్ర బృందాన్ని రాజమౌళి కోల్‌కతాకు తీసుకెళుతున్నారట.

అక్కడ కీలక సన్నివేశఆలను చిత్రించనున్నారట. ముఖ్యంగా హౌరా బ్రిడ్జ్‌పై కొన్ని యాక్షన్ సీన్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం. స్వాతంత్ర్యానికి పూర్వ పరిస్థితుల ఆధారాంగా ఈ మూవీ తెరకెక్కుతోందని కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే సినిమాకు సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు రాకుండా రాజమౌళి జాగ్రత్తగా పని కానిస్తున్నాడు.

కోల్‌కతాలో తాయాల్సిన సన్నివేశాల కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో మాదిరిగా ఎక్కడైనా ప్రత్యేకంగా సెట్ వేస్తారా లేక ఔట్ డోర్ షూటింగ్ చేస్తారా అనే సమాచారం తెలియలేదు. హరోయిన్లు ఎవరెవరనే అంశం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. అయితే ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాజమౌళి వేగంగా పని చేసుకుంటూ పోతున్నారు.