‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ఫస్ట్ లుక్: చంద్రబాబు లుక్ ఇదే..!

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ఫస్ట్ లుక్: చంద్రబాబు లుక్ ఇదే..!

డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్.. రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడూ వివాదాలకు పురుడు పోయడంలో.. ముందుండే వ్యక్తి. యథార్థ సంఘటలనే.. తీసుకుని సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు. తాజాగా.. ఎన్టీఆర్ జీవితంపై సినిమా తీసి పలు విమర్శలకు, గొడవలకు ఆజ్యం పోశారు. ఈ సినిమా విడుదలపై రచ్చరచ్చ అయిన సంగతి విదితమే. కాగా.. ఆ సినిమా తరువాత రామ్ గోపాల్ వర్మ మరో సినిమా తీస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో ఉన్న చిత్రంను.. ప్రేక్షుకుల ముందుకు తెచ్చేందుకు వర్మ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 06, 2019 | 3:27 PM

డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్.. రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడూ వివాదాలకు పురుడు పోయడంలో.. ముందుండే వ్యక్తి. యథార్థ సంఘటలనే.. తీసుకుని సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు. తాజాగా.. ఎన్టీఆర్ జీవితంపై సినిమా తీసి పలు విమర్శలకు, గొడవలకు ఆజ్యం పోశారు. ఈ సినిమా విడుదలపై రచ్చరచ్చ అయిన సంగతి విదితమే. కాగా.. ఆ సినిమా తరువాత రామ్ గోపాల్ వర్మ మరో సినిమా తీస్తున్నారు.

రాజకీయ నేపథ్యంలో ఉన్న చిత్రంను.. ప్రేక్షుకుల ముందుకు తెచ్చేందుకు వర్మ ప్రయత్నాలు చేస్తున్నారు. అదే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. ఇక ఈ సినిమాపై ఎన్ని వివాదాలు రాజుకుంటాయో ముందు ముందు చూడాలి. కాగా.. ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ 7వ తేదీ ఉదయం.. విడుదల చేస్తున్నామని.. చెప్తూ ట్వీట్టర్‌లో ట్వీట్ చేశారు. కాగా.. ఈ సినిమాలోని.. చంద్రబాబుకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని రివిల్ చేశారు. పోస్టర్‌లో చంద్రబాబు ఓల్డ్ ఏజ్‌లో ఉన్న గెటప్‌.. కళ్ల జోడు తీస్తూ.. షాక్ అవుతున్నట్లుగా ఉంది. అంతే.. కాకుండా. ఈ సినిమా షూటింగ్ శరవేగంతో.. సాగుతోందంటూ.. ట్వీట్‌లో తెలిపారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu