‘జోడి’ మూవీ రివ్యూ: ఇలా ఉందేంటి..?

టైటిల్: జోడి యాక్టర్స్: ఆది సాయి కుమార్, శ్రద్ధా శ్రీనాత్, వెన్నెల కిషోర్, గొల్లపూడి మారుతీ రావు, సత్య డైరెక్టర్: విశ్వనాథ్ అరిగెల ప్రొడ్యూసర్స్: సాయి వెంకటేష్ గుర్రం, పద్మజ మ్యూజిక్: ఫణి కళ్యాణ్ హీరోగా.. ఆది సాయి కుమార్, హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్ జంటగా తెరకెక్కిన మూవీ ‘జోడి’. రొమాంటిక్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను విశ్వనాథ్ అరిగెల దర్శకత్వం వహించగా.. సాయి వెంకటేష్ గుర్రం, పద్మజలు నిర్మాతలుగా వ్యవహరించారు. […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:51 pm, Fri, 6 September 19
'జోడి' మూవీ రివ్యూ: ఇలా ఉందేంటి..?

టైటిల్: జోడి
యాక్టర్స్: ఆది సాయి కుమార్, శ్రద్ధా శ్రీనాత్, వెన్నెల కిషోర్, గొల్లపూడి మారుతీ రావు, సత్య
డైరెక్టర్: విశ్వనాథ్ అరిగెల
ప్రొడ్యూసర్స్: సాయి వెంకటేష్ గుర్రం, పద్మజ
మ్యూజిక్: ఫణి కళ్యాణ్

హీరోగా.. ఆది సాయి కుమార్, హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్ జంటగా తెరకెక్కిన మూవీ ‘జోడి’. రొమాంటిక్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను విశ్వనాథ్ అరిగెల దర్శకత్వం వహించగా.. సాయి వెంకటేష్ గుర్రం, పద్మజలు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా ఈ రోజే రిలీజ్ అయింది. వీళ్లు ఎంత కామెడీ చేశారో.. ఎంతలా ఎమోషన్‌కి గురి చేశారో.. తెలుసుకోవాలంటే.. కథలోకి వెళ్లాల్సిందే..!

కథ: ఆది ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఆది తండ్రి నరేష్.. క్రికెట్‌పై మోజుతో ఎప్పుడూ బెట్టింగ్‌లు కాస్తూ ఉంటాడు. శ్రద్ధా శ్రీనాథ్‌ని చూసిన తొలి చూపులోనే ప్రేమలో పడతాడు హీరో ఆది. ఆ ప్రేమ కాస్తా పెళ్లికి దారితీస్తుంది. మొదట.. ఆదిని చూసి ఓకే.. అన్న శ్రద్ధా తండ్రి.. హీరో తండ్రి నరేష్‌ని చూడగానే.. వీరి పెళ్లిని క్యాన్సిల్ చేస్తాడు. అసలు శ్రద్ధా తండ్రి.. పెళ్లిని క్యాన్సిల్ చేయడానికి కారణమేంటి..? వివాహానికి అంగీకరించిన కాంచన తండ్రి, ఆది తండ్రి నరేష్‌ని చూశాక ఎందుకు సంబంధం క్యాన్సిల్ చేస్తాడు..? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Jodi Telugu Movie Review

విశ్లేషణ: ఈ సినిమాకి ప్రధాన బలహీనత ఏంటంటే.. కథ అనే చెప్పాలి. కొత్తదనం లేని కథలో వచ్చే సన్నివేశాలు చాలా రోటీన్‌గా ఉన్నాయి. సినిమాలో.. ప్రతీ సన్నివేశం.. ప్రేక్షకుడు క్యాచ్ చేసే విధంగా ఉన్నాయి. మొదటి సినిమాలో.. రొమాన్స్, కామెడీ బాగున్నా.. రెండో భాగంలో.. కథ నీరసంగా ఉంటుంది. పాత పాత్రలే కనిపిస్తూంటాయి. అసలు ఆది ఇలాంటి కథను ఎలా ఎంచుకున్నాడో.. అతనికే తెలియాలి.

నటీనటులు: పాత్రలకు తగ్గట్టుగానే.. ఆది, శ్రద్ధలు చక్కగా నటిస్తారు. మొదటి భాగంలో.. రొమాన్స్, కామెడీ చక్కగా పండుతుంది. శ్రద్ధా శ్రీనాథ్ అందంతో.. నటనతో ఆకట్టుకుంది. ముక్యంగా పాటలలో శ్రద్ధా చాలా అందంగా కనపడుతుంది. ఆది కూడా పాత సినిమాలకంటే ఈ సినిమాలో చక్కగా నటించాడు. ఎమోషన్స్ సీన్స్ బాగున్నాయి. ఇక నరేష్, మారుతీరావు, సత్య, వెన్నెల కిషోర్‌లు వాళ్ల పాత్రలకు తగిన న్యాయం చేశారు

ప్లస్ పాయింట్స్:

కొన్ని ఎమోషనల్ సీన్స్
కామెడీ
యాక్టింగ్

మైనస్ పాయింట్స్:

కథ
కథనం
నెమ్మదిగా సాగే కథనం
రొటీన్ టేకింగ్
కొత్తదనం కనిపించకపోవడం