AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raviteja: క్రాక్ సినిమాతో సంక్రాంతికి విందు భోజనం.. అభిమానులకు రవితేజ విజ్ఞప్తి..

ఈ సంక్రాంతికి రవితేజ థియేటర్లలో పండుగ చేయనున్నాడు. జనవరి 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‏కు విశేష స్పందన లభించింది.

Raviteja: క్రాక్ సినిమాతో సంక్రాంతికి విందు భోజనం.. అభిమానులకు రవితేజ విజ్ఞప్తి..
Rajitha Chanti
|

Updated on: Jan 05, 2021 | 9:57 PM

Share

ఈ సంక్రాంతికి రవితేజ థియేటర్లలో పండుగ చేయనున్నాడు. జనవరి 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‏కు విశేష స్పందన లభించింది. దీంతో ఈసారి రవితేజ క్రాక్ సినిమాతో రచ్చ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సందర్బంగా అభిమానులకు మాస్ మహరాజా రవితేజ ఓ విజ్ఞప్తి చేశాడు.

కరోనా ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లకు అనుమతిస్తున్నారని తెలుసు. క్రాక్ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందని ధీమ వ్యక్తం చేస్తున్నా. ప్రేక్షకుల ఆదరణే కలెక్షన్లుగా మారుతుందనుకుంటున్నా. ప్రతీ ఒక్కరూ మాస్క్ పెట్టుకొని చేతిలో చిన్న శానిటైజర్ బాటిల్‏ను తమతో తీసుకోని థియేటర్లకు వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా గోపిచంద్ మలినేని ఈ సినిమాను రూపొందిచాడు. మూవీ ప్రారంభం నుంచి ఎండింగ్ నా రోల్ ఎంటర్ టైనింగ్‏గా ఉంటుందని.. ట్రైలర్లో కేవలం సీరియస్ యాంగిల్ చూశారని.. కానీ థియేటర్లో వినోదాన్ని చూస్తారని చెప్పాడు రవితేజ.