బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ జనవరిలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది. కానీ అనుష్క శర్మ నిండు గర్భంతోనూ ఏదోక పనిచేస్తూ.. అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా అనుష్క చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 9 నెలల గర్బంతో కూడా అనుష్క తన జిమ్ సెంటర్లో ట్రెడ్మిల్ పై వర్కౌట్ చేస్తున్నట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది.
అనుష్క షేర్ చేసిన వీడియోలో ఆమె జిమ్ సెంటర్లో ట్రెడ్మిల్ పై చెమటలు చిందిస్తూ వర్కౌట్ చేస్తూ ఉంది. డాక్టర్ల సూచనల మేరకే తాను ఇలా ట్రెడ్మిల్ పై వర్కౌట్ చేస్తున్నట్లుగా అనుష్క పేర్కోంది. ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ.. తాను తీసుకుంటున్న జాగ్రత్తల గురించి, అలాగే బిడ్డ జన్మించిన తర్వాత విరాట్-అనుష్కలు ఆ పాపను ఎలా పెంచాలనుకుంటున్నారనే విషయాల గురించి ప్రస్తావించింది. గతంలో 9 నెలల గర్భంతోనూ అనుష్క ఓ యాడ్ చేసింది.
View this post on Instagram
Also Read:
విరుష్క జంటను ఆస్ట్రేలియాకు ఆహ్వానించిన బ్రెట్‌లీ.. ఆసీస్‌లో బిడ్డకు జన్మనివ్వాలని కోరిన మాజీ బౌలర్