మరో ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్న మాస్ మహారాజా.. ఆ స్పెషల్ రోజునే టీజర్ రిలీజ్ చేసే ఛాన్స్ ?
మాస్ మాహారాజా రవితేజ చాలా కాలం తర్వాత 'క్రాక్' సినిమా సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక అదే జోష్తో వరుస చిత్రాలను ప్రేక్షకుల ముందుకు
Actor Raviteja Khiladi Movie Update: మాస్ మాహారాజా రవితేజ చాలా కాలం తర్వాత ‘క్రాక్’ సినిమా సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక అదే జోష్తో వరుస చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడి’ సినిమాను చేస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. రవితేజకు జోడిగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి మరో అప్ డేట్ వినిపిస్తోంది.
రవితేజ నటిస్తున్న ఖిలాడి మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో అటు మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసే పనిలో పడ్డారట. వచ్చే నెల శివరాత్రి సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన వివరాలను చిత్రయూనిట్ విడుదల చేయలేదు. ఒక వేళ ఇదే కనుగ నిజమైతే.. రవితేజ మళ్లీ తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను పెన్ స్టూడియోస్ మరియు ఏ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.
Also Read:
Pushpa Movie: బన్నీకి చెల్లెలిగా నటించనున్న తమిళ ముద్దుగుమ్మ.. అయితే ఆ పాత్ర..