Pushpa Movie: బన్నీకి చెల్లెలిగా నటించనున్న తమిళ ముద్దుగుమ్మ.. అయితే ఆ పాత్ర..

Megha Akash Plays Sister Role For Bunny: అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో 'పుష్ఫ' సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుండడం, ఎప్పుడూ...

Pushpa Movie: బన్నీకి చెల్లెలిగా నటించనున్న తమిళ ముద్దుగుమ్మ.. అయితే ఆ పాత్ర..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 15, 2021 | 12:36 PM

Megha Akash Plays Sister Role For Bunny: అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ఫ’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుండడం, ఎప్పుడూ స్టైలిష్‌ లుక్‌లో కనిపించే బన్నీ ఇందులో ఊర మాస్‌ గెటప్‌లో కనిపించనుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.

ఈ అంచనాలకు తగ్గుట్లుగానే సుకుమార్‌ ఈ సినిమాలో భారీ కాస్టింగ్‌ ఉండేలా చూసుకుంటున్నాడు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను పాన్‌ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. దీంతో అన్ని భాషలకు చెందిన యాక్టర్లు ఉండేలా దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో తమిళ ముద్దుగుమ్మ నటించనుందని వార్తలు వస్తున్నాయి. తనెవరో కాదు.. ‘లై’ చిత్రంతో చిత్ర సీమకు పరిచయమైన మేఘా ఆకాశ్‌. పేరుకు తమిళ స్టార్‌ అయిన మేఘా తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. పుష్ఫ సినిమా కోసం సుకుమార్‌ ఇప్పటికే మేఘా ఆకాశ్‌ను సంప్రదించగా తను కూడా ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఇక్కడ మరో ఆసక్తికరమై విషయమేంటంటే.. ఈ సినిమాలో మేఘా ఆకాశ్‌ బన్నీకి చెల్లిగా నటిచంనుందనే వార్త ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకుంటోన్న సమయంలో ఓ స్టార్‌ హీరోకు చెల్లిగా మేఘా నటించడానికి ఒప్పుకోవడం విశేషం. ఇక ఈ సినిమాలో మేఘా ఆకాశ్‌ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని. మేఘా పాత్ర సినిమా మధ్యలోనే చనిపోతుందని ఓ టాక్‌ నడుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Anasuya Bharadwaj : పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తోన్న రంగమ్మత్త.. ముహర్తం ఖరారంటూ టాక్