Kalyan Ram’s new film: దూసుకుపోతున్న ‘మైత్రీ మూవీ మేకర్స్’.. కల్యాణ్​రామ్​తో కొత్త సినిమా ప్రారంభం

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దూసుకుపోతుంది. అగ్ర హీరోలు, మీడియం రేంజ్ హీరోలతో ఏకకాలంలో సినిమాలు నిర్మిస్తూ.. ఔరా అనిపిస్తుంది.

Kalyan Ram's new film: దూసుకుపోతున్న 'మైత్రీ మూవీ మేకర్స్'.. కల్యాణ్​రామ్​తో కొత్త సినిమా ప్రారంభం
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 15, 2021 | 11:26 AM

Kalyan Ram’s new film: టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దూసుకుపోతుంది. అగ్ర హీరోలు, మీడియం రేంజ్ హీరోలతో ఏకకాలంలో సినిమాలు నిర్మిస్తూ.. ఔరా అనిపిస్తుంది. టాలీవుడ్ టాప్ హీరోలు డేట్స్‌ సంపాదించిన ఈ ప్రొడ్యూసర్లు.. సౌత్‌లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులందరినీ లాక్ చేసేశారు. ఇటీవల ‘ఉప్పెన’తో హిట్​ కొట్టి మంచి జోష్‌లో ఉన్న ఈ సంస్థ..   తాజాగా నందమూరి కల్యాణ్​రామ్​ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభించింది. ఈ చిత్రంతో రాజేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

ఇప్పటికే చిరంజీవి, పవన్​కల్యాణ్, ప్రభాస్, జూ.ఎన్టీఆర్, బాలకృష్ణలతో మైత్రీ మూవీ మేకర్స్ కొత్త ప్రాజెక్టులు ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తారని ఈ నిర్మాణ సంస్థకు పేరుంది. కథ నచ్చితే చాలు.. నాన్చుడు వ్యవహారం లేకుండా ఈ నిర్మాతలు సినిమాను పట్టాలెక్కిస్తారని ఇండస్ట్రీ టాక్.

Also Read:

వాలంటైన్స్ డే: తమ కలలరాణి నిధి అగర్వాల్‌కు గుడి కట్టి, అభిమానుల పాలాభిషేకం.. షాక్‌కు గురైన నటి

రోజురోజుకు తగ్గుతున్న పసిడి ధరలు.. వెండి మాత్రం పైపైకి.. తాజా రేట్లు ఇలా..