Ravi Teja Birthday: యాక్షన్ మోడ్ లో రామారావు.. ఆకట్టుకుంటోన్న మాస్ మహారాజా బర్త్ డే పోస్టర్..

'క్రాక్' (Krack) హిట్ తర్వాత వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు మాస్ మహారాజా రవితేజ (Raviteja). అతని చేతిలో ప్రస్తుతం 5 సినిమాలు ఉన్నాయి. అందులో  ‘రామారావు ఆన్‌డ్యూటీ’ (RamaRao On Duty) ఒకటి.

Ravi Teja Birthday: యాక్షన్ మోడ్ లో రామారావు.. ఆకట్టుకుంటోన్న మాస్ మహారాజా బర్త్ డే పోస్టర్..
Raviteja
Follow us
Basha Shek

|

Updated on: Jan 26, 2022 | 11:41 AM

‘క్రాక్’ (Krack) హిట్ తర్వాత వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు మాస్ మహారాజా రవితేజ (Raviteja). అతని చేతిలో ప్రస్తుతం 5 సినిమాలు ఉన్నాయి. అందులో  ‘రామారావు ఆన్‌డ్యూటీ’ (RamaRao On Duty) ఒకటి. రవితేజ 68వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను  శరత్ మండవ తెరకెక్కిస్తున్నాడు. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ ఓ ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్లకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.  తాజాగా రవితేజ పుట్టినరోజు(జనవరి 26) సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది చిత్రబృందం. ఈ సందర్భంగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేసింది.

ఈ బర్త్ డే పోస్టర్ లో రవితేజ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నాడు. అలాగే సినిమాలో  ట్రైన్ సన్నివేశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మూవీలో రొమాంటిక్ ట్రాక్ తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ అంశాలు పుష్కలంగా ఉన్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. కాగా షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని మార్చి25న విడుదల చేస్తున్నట్లు ఇంతకుముందు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాకు సామ్ సీఎస్ స్వరాలు సమకూరుస్తున్నారు.  కాగా ఈ సినిమాతో పాటు ‘ఖిలాడీ’, ‘ధమాకా’, ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు రవితేజ.

Also Read:Actor Srikanth: థర్డ్ వేవ్ లో భారీగా కరోనా బారిన పడుతున్న సినీనటులు.. తాజాగా శ్రీకాంత్ కు పాజిటివ్ గా నిర్ధారణ..

Actress Rani Chatterjee: కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి రాణీ ఛటర్జీ… యూపీ ఎన్నికలే టార్గెట్!

Ananya Panday: చలికి తట్టుకోలేకపోయిన ‘లైగర్’ బ్యూటీ.. యంగ్ హీరో చేసిన పనికి నెటిజన్లు ఫిదా..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే