Cinema OTT: ఓటీటీలోకి వచ్చేసిన రూ.1800 కోట్ల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..
ఇన్నాళ్లు థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. హిందీతోపాటు తమిళం, తెలుగు భాషలలోనూ ఆ సినిమా స్ట్రీమింగ్ అవతుంది. ఇంతకీ బాక్సాఫీస్ వద్ద రారాజుగా నిలిచిన సినిమా ఏంటీ.. ?ఎక్కడ చూడొచ్చు ? అని ఆలోచిస్తున్నారా. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.

థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడిన తర్వాత, రణవీర్ సింగ్ నటించిన “ధురందర్ 2” ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేసింది. ఈ సినిమా మే 15న రెండు ఓటీటీల్లోకి వచ్చేసింది. దీంతో ఇప్పటివరకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అభిమానుల నిరీక్షణకు తెర పడింది. రణవీర్ సింగ్ నటించిన “ధురందర్ 2” ఓటీటీ విడుదల కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన “ధురందర్: ది రివెంజ్” పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇందులో సారా అర్జున్ కథానాయికగా నటించింది. ఈ చిత్రం భారతదేశంలో జియోహాట్‌స్టార్‌లో విడుదల అవుతుండగా, విదేశాలలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..
రణవీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్-థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. ఇది భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా, 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలోని నటీనటుల నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఇందులో సంజయ్ దత్, ఆర్. మాధవన్, రాకేష్ బేడీ, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రలలో నటించారు.
ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..
అంతకు ముందు ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ భారీ విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ ఆదిత్య ధర్. తర్వాత దురంధర్ మూవీతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన సినిమాను ఇప్పుడు మీరు ఇంట్లోనే ఉండి చూడొచ్చు.
ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..
ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..
