Peddi Movie : యూట్యూబ్‌లో పెద్ది సంచలనం.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న పవర్ ఫుల్ వీడియో..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే ఈచిత్రం అడియన్స్ ముందుకు రావాల్సి ఉండగా.. పలు కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు ఎట్టకేలకు జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ఓ పవర్ ఫుల్ వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతుంది.

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక అంచనాలు నెలకొన్న సినిమా పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. ఏఆర్ రెహామాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ఇందులో చరణ్ లుక్స్, ఎనర్జీ చూస్తుంటే ఏస్థాయిలో పెద్ది అలరించనుందనే విషయం అర్థమైపోతుంది. ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. దీంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీ అప్డేట్స్ రిలీజ్ చేస్తారా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..
తాజాగా ఈ సినిమా నుంచి శివరాజ్ కుమార్ పాత్రకు సంబంధించి ఓ పవర్ ఫుల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఆయన గౌరి నాయడు అనే పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన వీడియిలో శివన్న కుస్తీ పట్లు పడతూ ఊరమాస్ లుక్ లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఇందులో శివన్న పాత్ర రామ్ చరణ్ కు కుస్తీలో శిక్షణ ఇచ్చే గురువుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది.
ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..
ఇప్పటికే విడుదలైన “చికిరి చికిరి”, “రాయ్ రాయ్ రా రా” వంటి పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఇందులో జగపతి బాబు, బోమన్ ఇరానీ , దివ్యేందు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..
Gournaidu a.k.a @nimmashivanna garu❤️🔥❤️🔥
Step into the raw world of #PEDDI#PEDDITrailer in 4 days 🔥
Peddi in cinemas worldwide on 4th June.#GetReadyForPeddi 💥💥
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla… pic.twitter.com/HAV93MYYab
— Vriddhi Cinemas (@vriddhicinemas) May 14, 2026
ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..
