AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranbir Kapoor: అయోధ్యలో భూమి కొనుగోలు చేసిన రామాయణ హీరో.. ఎన్ని కోట్లో తెలిస్తే ఆశ్చర్యపోతారు

రామ మందిర నిర్మాణం తర్వాత, అయోధ్య దేశంలోనే ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా మారింది. అలాగే రియల్ ఎస్టేట్ పరంగానూ బాగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే అక్కడ అమితాబ్ బచ్చన్ లాంటి పలువురు ప్రముఖులు భూములను కొన్నారు. తాజాగా బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్ బీర్ కపూర్ కూడా అయోధ్యలోని ఒక విలాసవంతమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లో భూమి కొన్నాడు.

Ranbir Kapoor: అయోధ్యలో భూమి కొనుగోలు చేసిన రామాయణ హీరో.. ఎన్ని కోట్లో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Bollywood Actor Ranbir Kapoor
Basha Shek
|

Updated on: May 15, 2026 | 6:44 AM

Share

బిగ్ బి అమితాబ్ బచ్చన్ తర్వాత, బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ కూడా ఇప్పుడు అయోధ్యలో భూమిని కొనుగోలు చేశారు. అయోధ్యలోని సరయూ నది ఒడ్డున నిర్మిస్తున్న అత్యాధునిక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ‘ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా’లో రూ. 3.31 కోట్ల విలువైన భూమిని రణబీర్ కపూర్ కొనుగోలు చేసినట్లు ఏజెన్సీ గురువారం (మే 14) వెల్లడించింది. రణ్‌బీర్ కొనుగోలు చేసిన 2,134 చదరపు అడుగుల భూమి, దేవాలయ నగరమైన అయోధ్యలో విలాసవంతమైన ఆస్తులకు ఉన్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది. 75 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, సరయూ నది ఒడ్డున ఉంది. సువిశాలమైన ఈ ప్రాంతంలో భారీ క్లబ్ హౌస్, విలాసవంతమైన సౌకర్యాలతో పాటు.. ది లీల నిర్వహించే లగ్జరీ హోటల్ కూడా ఉంది.అయోధ్యలో భూమి కొనడంపై రణబీర్ కపూర్ తన ఆనందాన్ని ఇలా పంచుకున్నారు, “అయోధ్య నన్ను ఎంచుకుందని నేను నమ్ముతున్నాను. ఇది మన చరిత్ర, సంస్కృతిలో ఒక అంతర్భాగం. ఈ ప్రదేశం నా కుటుంబ వారసత్వంలో కూడా ఒక భాగంగా నిలుస్తుందని నేను ఆశిస్తున్నాను.’ అని చెప్పుకొచ్చాడు.

రణబీర్ కపూర్ ప్రస్తుతం నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణం’ చిత్రంలో శ్రీరాముడి పాత్రను పోషిస్తున్నారు. సుమారు రూ. 4,000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా అమితాబ్ బచ్చన్ ఇప్పటికే అయోధ్యలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. 2026 మార్చిలో, ఆయన రూ. 35 కోట్ల వ్యయంతో 2.67 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అంతకు ముందు, 2025లో, ఆయన అయోధ్యలో రూ. 40 కోట్ల విలువైన ప్లాట్లను కొనుగోలు చేయగా, 2024లో రూ. 14.5 కోట్ల విలువైన ప్లాట్లను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు.

 అమితాబ్, రణ్ బీర్.. అయోధ్యలో భూములు కొంటోన్న సెలబ్రిటీలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us