Bigg Boss : టెన్నిస్ కోర్టులో సందడి చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. నెట్టింట గ్లామర్ క్వీన్ సెన్సేషన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఈ షో నుంచి బయటకు వచ్చిన ముద్దుగుమ్మలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. గ్లామర్ ఫోటోషూట్లతో సందడి చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ?

ప్రస్తుతం సోషల్ మీడియాలో బిగ్ బాస్ బ్యూటీ గ్లామరస్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. టెన్నిస్ కోర్టులో గ్లామర్ లుక్కులో కనిపిస్తూ సందడి చేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తను మరెవరో కాదండి బిగ్ బాస్ ఫేమ్ భాను శ్రీ. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు, వెండితెర అభిమానులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు భానుశ్రీ. ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, అంతకు ముందు స్మాల్ స్కీన్ పై యాంకర్ గా అలరించింది. అలాగే బిగ్ బాస్ రియాల్టీ షోలో తనదైన గ్లామర్, ఎనర్జిటిక్ పర్‌ఫార్మెన్స్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం పలు టీవీ షోలు, సీరియల్స్ , సినిమాలలో నటించి మెప్పించిన భానుశ్రీ, సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో సందడి చేస్తుంటుంది. తాజాగా భానుశ్రీ షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‌లోకి సీరియల్ బ్యూటీ.. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ మళ్లీ వచ్చేస్తుంది.. ఇక ఎంటర్టైన్మెంట్ అదిరిపోవాల్సిందే..
టెన్నిస్ కోర్టులో స్పోర్టీ లుక్‌లో దిగిన ఈ ఫోటోలలో భానుశ్రీ అత్యంత గ్లామరస్‌గా కనిపించింది. స్టైలిష్ షార్ట్ స్కర్ట్, స్పోర్ట్స్ టాప్ ధరించి, చేతిలో టెన్నిస్ రాకెట్‌తో టెన్నిస్ ఆడుతూ దిగిన భంగిమలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, ఫిట్‌నెస్‌పై కూడా ఎంత శ్రద్ధ చూపుతుందో ఈ ఫోటోల ద్వారా తెలియజేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవ్వడమే కాకుండా, నెటిజన్ల నుంచి క్రేజీ కామెంట్స్ వస్తున్నాయి. భానుశ్రీ గ్లామరస్ స్పోర్టీ అవతార్‌ను చూసి ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. “స్పోర్టీ లుక్‌లో సూపర్ ఉన్నావు”, “ఫిట్‌నెస్ గోల్స్” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కెరీర్ పరంగా చూస్తే, మోడలింగ్‌తో ప్రయాణం ప్రారంభించిన భానుశ్రీ, ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి గుర్తింపు పొందింది. బిగ్ బాస్ తెలుగు షోలో పాల్గొన్న తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ప్రసుతం ఒకవైపు బుల్లితెర షోలలో సందడి చేస్తూనే, మరోవైపు నటిగా కొత్త ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంటోంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోషూట్‌లతో అభిమానులకు విజువల్ ట్రీట్ ఇచ్చే భానుశ్రీ, తాజాగా పంచుకున్న ఈ టెన్నిస్ కోర్ట్ పిక్స్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారాయి.
ఎక్కువ మంది చదివినవి : Eknath Harika : భర్తతో కలిసి కొత్తింట్లోకి సీరియల్ బ్యూటీ.. నూతన గృహప్రవేశం చేసిన హారిక.. ఫోటోస్ వైరల్..
భానుశ్రీ పోస్ట్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..
