AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal varma: గరికపాటి, చిరు ఇష్యూలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్‌ గోపాల్‌ వర్మ.. అగ్నికి ఆజ్యం పోసేలా..

ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు, మెగాస్టార్‌ చిరంజీవిల మధ్య జరిగిన వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో చిరు అభిమానుల కోరిక మేరకు ఫొటోలకు పోజులివ్వడం, దాన్ని చూసి గరికపాటి..

Ram Gopal varma: గరికపాటి, చిరు ఇష్యూలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్‌ గోపాల్‌ వర్మ.. అగ్నికి ఆజ్యం పోసేలా..
Rgv Tweet On Chiru Garikapati issue
Narender Vaitla
|

Updated on: Oct 11, 2022 | 8:24 AM

Share

ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు, మెగాస్టార్‌ చిరంజీవిల మధ్య జరిగిన వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో చిరు అభిమానుల కోరిక మేరకు ఫొటోలకు పోజులివ్వడం, దాన్ని చూసి గరికపాటి ఫొటోలు ఆపేస్తే ప్రసంగాన్ని కొనసాగిస్తాననడం పెద్ద రచ్చకు దారి తీసింది. అయితే ఈ విషయంలో చిరు ఎలాంటి అసహనం వ్యక్తం చేయకపోయినా ఆయన ఫ్యాన్స్‌ మాత్రం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మెగా బ్రదర్‌ నాగబాబు చేసిన ట్వీట్‌కు కూడా అగ్నికి ఆజ్యం పోసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వెంటనే రియలైజ్‌ అయిన నాగబాబు మరో ట్వీట్‌ చేసినా ఈ వివాదం సమసిపోలేదు.

అయితే ఇప్పుడిప్పుడే ఈ వివాదం కాస్త సద్దుమణుగుతోందని అనుకుంటున్న సమయంలోనే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి ట్విట్టర్‌ వేదికగా సంచలన ట్వీట్స్‌ చేశాడు. టాపిక్‌ ఏదైనా, సమాజంలో జరిగే ప్రతీ అంశంపై స్పందించే వర్మ ఇప్పుడు గరికపాటి, చిరంజీవి ఇష్యూలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయంలో వర్మ చిరంజీవికి సపోర్ట్‌గా నిలిచాడు. గరికపాటిపై విమర్శలు కురిపించారు. ‘మిమ్మల్ని మెగా ఫ్యామిలీ క్షమించినా.. అభిమానులైన మేం వదిలే ప్రసక్తే లేదంటూ’ ట్వీట్‌ చేశాడు.

మెగా బ్రదర్‌ నాగబాబు ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశాడు వర్మ. అంతటితో ఆగకుండా చిరంజీవిని కూడా ట్యాగ్ చేశాడు. నువ్వేంటో తెలుసుకో అంటూ గరికపాటిపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు. దీంతో ఈ టీట్స్‌ కాస్త వైరల్‌ అవుతున్నాయి. వర్మ ఎప్పుడెలా స్పందిస్తారో తెలియదంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

వర్మ చేసిన ట్వీట్స్‌ ఇవే..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..