Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV: బయటకు కనిపించే వర్మ, అసలు వర్మ వేరేనా.? ఆసక్తికర విషయాలు పంచుకున్న ఆర్జీవీ తల్లి.

రామ్‌గోపాల్‌ వర్మ.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో ఎక్కువగా వార్తల్లో నిలవడం వర్మకు మాత్రమే దక్కుతుంది. సమాజంలో జరిగే ప్రతీ అంశంపై తనదైన శైలిలో స్పందించే వర్మ నిత్యం వివాదాలతో సావాసం చేస్తుంటారు..

RGV: బయటకు కనిపించే వర్మ, అసలు వర్మ వేరేనా.? ఆసక్తికర విషయాలు పంచుకున్న ఆర్జీవీ తల్లి.
Rgv
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 18, 2022 | 6:25 AM

రామ్‌గోపాల్‌ వర్మ.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో ఎక్కువగా వార్తల్లో నిలవడం వర్మకు మాత్రమే దక్కుతుంది. సమాజంలో జరిగే ప్రతీ అంశంపై తనదైన శైలిలో స్పందించే వర్మ నిత్యం వివాదాలతో సావాసం చేస్తుంటారు. తనకు నచ్చిందే చేస్తా, నచ్చిందే మాట్లాడుతా, నచ్చిందే తీస్తా నచ్చిదే చూడండి లేకపోతే మానేయండి అని చెబుతుంటాడు వర్మ. తనకు ఎవరూ గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పడం వర్మకు మాత్రమే దక్కింది. నేటి తరం యువత కూడా వర్మను ఫాలో అవుతుండడం విశేషం. ఇక నిత్యం డిఫ్రెంట్‌గా ఆలోచించే వర్మ నిజ జీవితంలోనూ ఇలాగే ఉంటారా.? అనే అనుమానం రాకమానదు. ఈ నేపథ్యంలో తాజాగా వర్మ తల్లి సూర్యమ్మ ఓ ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తాజాగా డెంజరేస్‌ మూవీతో వర్మ మరోసారి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆషూ రెడ్డి ఇంటర్వ్యూతో సోషల్‌ మీడియాలో అలజడి సృష్టించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ మదర్‌ సూర్యమ్మ పలు షాకింగ్ కామెంట్స్‌ చేశారు. తాను రాముతో కలిసి జీఎస్‌టీ మూవీని చూశానన్న సూర్యమ్మ.. తను ఇతరుల ఇష్టాలను ఎంతో గౌరవిస్తాడని తెలిపారు. తనకు ఎమోషన్స్‌ లేనవి చెప్పుకునే వర్మ అమ్మ విషయంలో మాత్రం దీనికి భిన్నంగా ఉంటారని సూర్యమ్మ మాటల్లో తెలుస్తోంది. వర్మ ఇంటికి రాగానే తల్లి లేకపోతే నచ్చదంటా.. ఈ విషయమై సూర్యమ్మ మాట్లాడుతూ.. ‘ఇంటి రాగానే నేను తారసపడితే తన కళ్ళల్లో మెరుపు కనిపిస్తుంది. ఇక తాను మారాలనుకున్నపుడే మారతాడు. ఎవ్వరు చెప్పిన వినడు. ఈ జన్మకు తానంతే’ అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం వర్మ అమ్మ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తనకు ఎలాంటి ఎమోషన్స్‌ ఉండవని చెప్పే వర్మ తల్లి విషయంలో ఇంత సెంటిమెంట్‌గా ఉంటారా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా జయాపజయాలకు అతీతంగా వర్మ వ్యవహరించే శైలి ప్రతీ ఒక్కరికీ అంతుచిక్కని ఓ మిస్టరినే అని చెప్పడంలో ఎలంటి సందేహం ఉండదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

రన్యారావుకు కోర్టులో షాక్‌.. ఏమైందంటే వీడియో
రన్యారావుకు కోర్టులో షాక్‌.. ఏమైందంటే వీడియో
సూర్యుడు పూర్తిగా మాయమైతే.. అస్సలు ఏమవుతుందో తెలుసా ??
సూర్యుడు పూర్తిగా మాయమైతే.. అస్సలు ఏమవుతుందో తెలుసా ??
రైల్లోంచి చెత్తను విసిరేసిన ఉద్యోగి.. నెటిజన్లు సీరియస్
రైల్లోంచి చెత్తను విసిరేసిన ఉద్యోగి.. నెటిజన్లు సీరియస్
రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి ??
రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి ??
ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్‌!
ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్‌!
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?