AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దలైలామా వారసుడు ఎవరు? కొత్త పుస్తకంలో పునర్జన్మ గుట్టు విప్పారా?

బౌద్ధ గురువు దలైలామా మళ్లీ పుడతారా? ఆయన పునర్జన్మ.. టిబెట్‌లో ఉండదా? చైనా, టిబెట్‌లలో కాకుండా లామా మళ్లీ పుట్టేదెక్కడ? ఆయన రాసిన కొత్త పుస్తకంలో పునర్జన్మ గుట్టు విప్పారా? ఆయన భవిష్యవాణి నిజమవుతుందా? దాన్ని చైనా ఒప్పుకుంటుందా? అసలు దలైలామా జన్మ రహస్యం ఏంటి? తెలుసుకుందాం..!

దలైలామా వారసుడు ఎవరు? కొత్త పుస్తకంలో పునర్జన్మ గుట్టు విప్పారా?
Dalai Lama 'voice For The Voiceless'
Balaraju Goud
|

Updated on: Mar 12, 2025 | 8:41 AM

Share

పురాణాలు, పునర్జన్మలు.. మనకే కాదు, బౌద్ధులకు కూడా ఉన్నాయి. తాజాగా టిబెట్‌ బౌద్ధ గురువు దలైలామా ఓ సంచలన ప్రకటన చేశారు. తన వారసుడు చైనా బయటే జన్మిస్తాడని దలైలామా పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన తన తాజా పుస్తకంలో ప్రస్తావించారు. ఆరు దశాబ్దాలకు పైగా టిబెట్.. చైనా ఆక్రమణలో ఉంది. చైనాతో దలైలామాకు వివాదం ఉన్న విషయం తెలిసిందే. తన తర్వాత దలైలామా వారసత్వం కొనసాగాలని ఆయన రాసిన వాయిస్‌ ఫర్‌ ది వాయిస్‌లెస్‌ పుస్తకంలో కోరారు.

గతంలో ఓ సందర్భంలో దలైలామా మాట్లాడుతూ తన తర్వాత, లామా పరంపర ముగిసిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, తాజా పుస్తకంలో మాత్రం చైనా బయట కొత్త దలైలామా పుడతారని పేర్కొన్నారు. తన పునర్జన్మ టిబెట్‌ బయట జరగొచ్చని.. అది భారత్‌లో కూడా కావచ్చని ఆయన పేర్కొన్నారు. పూర్వీకుల పనిని ముందుకు తీసుకెళ్లడానికి ఉద్దేశించిందే పునర్జన్మ. కొత్త దలైలామా చైనా బయట స్వేచ్ఛా ప్రపంచంలో జన్మిస్తారు. తన బాధ్యత అయిన విశ్వకరుణకు గొంతుకగా ఉంటారు అని ఆ పుస్తకంలో బౌద్ధ గురువు పేర్కొన్నారు.

14వ దలైలామాగా మారిన టెంజియన్‌ గ్యాట్సో 23వ ఏటే టిబెట్‌ నుంచి భారత్‌కు వలస వచ్చారు. 1950లో తమ ప్రాంతాన్ని ఆక్రమించిన చైనాకు వ్యతిరేకంగా ఆయన గళం విప్పారు. టిబెట్‌ వాదాన్ని సజీవంగా ఉంచినందుకు ఆయనకు 1989లో నోబెల్‌ శాంతి బహుమతి వచ్చింది. తన వారసుడిగా చైనా ప్రకటించే వ్యక్తికి ఎటువంటి గౌరవం లభించదని దలైలామా ఆ పుస్తకంలో వెల్లడించారు.

దలైలామా ప్రస్తుతం భారత్‌లోని ధర్మశాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఆయన అక్కడి నుంచే తన వారసుడిని ఎంపిక చేయనున్నారు. ఇది చైనాకు గిట్టక తన గడ్డపైనే వారసుడిని గుర్తించాలంటోంది. టిబెటన్‌ బౌద్ధుల దృష్టిలో దలైలామా తర్వాత రెండో స్థానం పాంచెన్‌ లామాది. ఈ పదవికి దలైలామా ఎంపిక చేసిన బాలుడిని కాదని, చైనా తానే ఒక బాలుడిని నియమించినా, టిబెటన్ల ఆమోదం పొందడంలో అతడు విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు దలైలామా కొత్త వారసుడి ఎంపికపై ఆసక్తి నెలకొంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!