Saturn Rahu Conjunction: త్వరలో శని రాహుల కలయిక.. ఉగాది నుంచి ఈ 4 రాశులకు మహర్దశ.. మీరున్నారా చెక్ చేసుకోండి..
జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు, రాశులు, నక్షత్రాలకు విశేష స్థానం ఉంది. నవ గ్రహాలు ఒక రాశి నుంచి మరొక నక్షత్రంలోకి, వివిధ రాశుల్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా గ్రహాలు సంచరించే సమయంలో 12 రాశులపై మంచి, చెడుల ప్రభావం పడుతుంది. అయితే ఈ నవ గ్రహాల్లో సూర్యుడు తనయుడు శనీశ్వరుడు తో పాటు.. రాహు కేతులు వెరీ వెరీ స్పెషల్. ఈ గ్రహాలు అన్నిటిలో కర్మ ఫలదాత శని.. చాయ గ్రహం రాహువుల గురించి ప్రత్యేకంగా చెబుతుంది. ఈ గ్రహాల ఆగ్రహం ఎన్ని కష్టాలు తెస్తుందో.. అనుగ్రహం అంతే సుఖాలను ఇస్తుంది.

జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు వివిధ రాశుల్లో ప్రయాణిస్తూ ఉంటాయి, ఈ సమయంలో మొత్తం 12 రాశులపై ప్రభావం పడుతుంది. నవ గ్రహాల్లో శని, రాహువులు వెరీ వెరీ స్పెషల్. వీటి ప్రభావం కొన్ని రాశులపై తీవ్రంగా ఉంటే జీవితంలో రకరకాల మార్పులు జరుగుతాయి. ఈ నెల 30వ తేదీన అంటే ఉగాది రోజున ఈ రెండు గ్రహాలు మీనరాశిలో కలవనున్నాయి. ఇక్కడే ఈ రెండు గ్రహాలు మే 18 వరకు కలిసి ఉంటాయి. అయితే మీనరాశిలో ఈ రెండు గ్రహాల కలయిక వలన కొన్ని రాశుల వారి అదృష్టం పడిశం పట్టినట్లు పడుతుంది. ఊహించని విధంగా లాభాలను పొందుతారు. ఈ రోజు ఉగాది నుంచి దాదాపు 40 రోజుల పాటు అదృష్టాన్ని సొంతం చేసుకునే రాశులు ఏమిటో తెలుసుకుందాం..
మిథున రాశి: మీనరాశిలో శని రాహుల కలయిక వలన ఈ మిథున రాశికి చెందిన వ్యక్తుల జీవితంపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు లాభాలను పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి ఉద్యోగం లభిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విదేశీ ప్రయాణం ప్రయత్నాలు చేస్తున్నవారు గుడ్ న్యూస్ వింటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొత్త వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది.
వృషభ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులపై శని, రాహుల అనుగ్రహం ఉంటుంది. దీంతో వీరి దశ మార్చి 30 నుంచి మారుతుంది. అప్పటి వరకూ ఉన్న కష్టాలు తొలగిపోతాయి. ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ సొంతం చేసుకుంటారు. పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా సాగుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఆదాయం ఎక్కువగా ఉంటుంది. దీంతో డబ్బు ఇబ్బందులు తీరతాయి.
కర్కాటక రాశి: శని, రాహుల కలయికతో ఈ రాశి వారికీ అన్నింటా శుభ ఫలితాలే. వ్యాపారులు తమ వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. ఉద్యోగులకు ఏ పని మొదలు పెట్టినా రెట్టింపు ఫలితాలు పొందుతారు. విదేశాల నుంచి ఉద్యోగ అవకాశం అందుకునే వీలు ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలితస్తాయి. అకస్మాత్తుగా ధన లాభం పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు మీ సొంతం. సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపారులు కొత్త బాగస్వాములతో వ్యాపారాన్ని విస్తరించే ఆలోచన చేస్తారు.
తులా రాశి: ఈ రాశి వారికి ఉగాది (మార్చి 30) నుంచి మహార్దశ పట్టనుంది. ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు పెట్టిన పెట్టుబడులతో భవిష్యత్తులో అధిక లాభాలను ఆర్జిస్తారు. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుడి. ఉద్యోగస్తులకు ఆఫీసులో సహా ఉద్యోగాల మద్దతు లభిస్తుంది. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు సక్సెస్ అందుకుంటారు. మొత్తానికి ఈ రాశికి చెందిన వ్యక్తులు మే 18 వరకూ శుభవార్తలు వింటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు