Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold News: గోల్డ్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఇక్కడ అతి తక్కువ ధరకే బంగారం కొనవచ్చు..! దుబాయ్‌లో కాదు మనదేశంలోనే..

బంగారం ధర రోజురోజుకూ పెరుగుతోంది. పేద, మధ్య తరగతి సామాన్య ప్రజలు బంగారం కొనాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ, బంగారం కొనేందుకు మన భారతీయులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మార్కెట్‌తో సంబంధం లేకున్నా బంగారం కొనేవారు ఆరాటపడుతూనే ఉంటారు. అయితే, ఈ మారుతున్న కాలంలో విదేశీయులకు కూడా బంగారం పట్ల ఆసక్తి పెరిగింది. అందుకే భూమిపై బంగారం ధర ఆకాశాన్ని అంటుతోంది. అయితే, బంగారం కొనడం కష్టమని భావించే వారికి ఇది ఒక గొప్ప శుభవార్త అనే చెప్పాలి.

Gold News: గోల్డ్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఇక్కడ అతి తక్కువ ధరకే బంగారం కొనవచ్చు..! దుబాయ్‌లో కాదు మనదేశంలోనే..
Gold
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 12, 2025 | 7:48 AM

భారతదేశంలో బంగారం ధర రోజురోజుకూ పెరుగుతోంది. దీనివల్ల సామాన్యులు బంగారం కొనడం కష్టమవుతోంది. ప్రస్తుతం బంగారం ధర గ్రాముకు రూ.9,000 దాటింది. అయితే, మీరు దుబాయ్‌లో కాదు.. మన దేశంలోనే ఒక రాష్ట్రంలో అతి తక్కువ ధరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. అవును మీరు చదివింది నిజమే.. భారతదేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ఒక రాష్ట్రంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.80,190లు కాగా, 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.87,480 లకే లభిస్తుంది.

బంగారం ధరలు పన్నులు, దిగుమతి సుంకాలు, రవాణా ఛార్జీలు మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల భారతదేశంలో బంగారం ధర ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి మారుతూ ఉంటుంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈరోజు బంగారం ధర 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.8,748గా ఉంది. అలాగే 22k బంగారం ధర గ్రాముకు రూ.8,019. ఉంది. 18k బంగారం ధర గ్రాముకు రూ. 6,561లకే లభిస్తుంది.

అలాగే, మన రాష్ట్రం పక్కనే ఉన్న ఒక చిన్న రాష్ట్రంలో మీరు దేశంలోనే అతి తక్కువ ధరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. భారతదేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత తక్కువ ధరకు బంగారాన్ని కొనలేరు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నుండి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, కేరళలో ప్రతి సంవత్సరం 200 నుండి 225 టన్నుల బంగారం అమ్ముడవుతోంది. నిజానికి, కేరళ రాష్ట్రం అనేక ఓడరేవులకు దగ్గరగా ఉండటం వల్ల ఎక్కువ బంగారాన్ని దిగుమతి చేసుకోవడం సులభం అవుతుంది. అదనంగా, రవాణా ఖర్చులు తక్కువగా ఉండటం, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ బంగారం విక్రేతలు అధిక పన్ను భారాన్ని ఎదుర్కోకపోవడం వల్ల కేరళలో అతి తక్కువ ధరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..