ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీపాట్.. ఒంటినిండా వజ్రావైడూర్యాలే.. దీని ధర తెలిస్తే మైండ్‌బ్లాంక్ అవ్వాల్సిందే..
టీ తాగడానికి చాయ్ ప్రియులు ఫేమస్ చాయ్ పాయింట్ల కోసం చూస్తున్నట్లే, ఫ్యాన్సీ టీ కప్పులు, టీ పాట్‌ల కోసం కూడా చూస్తుంటారు. అలాంటిదే ఇక్కడ ఒక అందమైన టీపాట్ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీపాట్‌గా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోనే ఇది అత్యంత ఖరీదైన టీపాట్‌గా పేరు తెచ్చుకున్న దీని ధర వింటే, ఒక్క క్షణం మీ గుండెలు గుభేల్ మంటాయి. ఎందుకంటే.. దీని విలువ చాలా ఖరీదు..

ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటైన టీ.. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇష్టమైనది. ఈ వేడి, తీపి మూలికా టీని ఎక్కువగా ఆసియా దేశాలలో వినియోగిస్తారు. పురాణాల ప్రకారం, క్రీస్తుపూర్వం 2737 ప్రాంతంలో ఒక చైనా చక్రవర్తి ఈ టీని కనుగొన్నాడని చెబుతారు. టీ ఆకులు అనుకోకుండా మరిగే నీటిలో పడినప్పుడు టీ కనుగొనబడిందని చెబుతారు. కాలక్రమేణా, టీ రుచి భారతదేశం, జపాన్‌తో సహా ఆసియాలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. అక్కడ అది ప్రసిద్ధ పానీయంగా మారింది. టీ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల టీ ఆకులు, పొడులు అందుబాటులో ఉన్నాయి. టీ ధర కూడా పది రూపాయల నుండి లక్ష రూపాయల వరకు ఉంటుంది. టీకి ఉన్న ప్రజాదరణ కారణంగా దాని ఆకులు, పొడులు మాత్రమే కాకుండా దానిని ఆస్వాదించేందుకు ఉపయోగించే కప్పులు, టీపాట్లు కూడా ఖ్యాతిని పొందాయి.
టీ తాగడానికి చాయ్ ప్రియులు ఫేమస్ చాయ్ పాయింట్ల కోసం చూస్తున్నట్లే, ఫ్యాన్సీ టీ కప్పులు, టీ పాట్‌ల కోసం కూడా చూస్తుంటారు. అలాంటిదే ఇక్కడ ఒక అందమైన టీపాట్ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీపాట్‌గా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోనే ఇది అత్యంత ఖరీదైన టీపాట్‌గా పేరు తెచ్చుకున్న దీని ధర వింటే, ఒక్క క్షణం మీ గుండెలు గుభేల్ మంటాయి. ఎందుకంటే.. దీని విలువ చాలా ఖరీదు..ఈ అందమైన టీపాట్‌ను “ది ఎగోయిస్ట్” అని పిలుస్తారు.
“ది ఎగోయిస్ట్”:
ఈ మెరిసే టీపాట్ 2016 నుండి అత్యంత ఖరీదైన టీపాట్‌గా ప్రపంచ రికార్డును కలిగి ఉంది. ఈ పాట్ బ్రిటిష్-ఇండియన్ బిలియనీర్ నిర్మల్ సేథియా స్థాపించిన UK ఛారిటీ అయిన N సేథియా ఫౌండేషన్ యాజమాన్యంలో ఉంది. ఈ అందమైన, మెరిసే రత్నాల కెటిల్‌ను ఇటాలియన్ ఆభరణాల వ్యాపారి ఫుల్వియో స్కావియా రూపొందించారు. ఈ విలువైన పాట్‌ను టీ వ్యాపారి అయిన నిర్మల్ సేథియా, టీకి నివాళి అర్పించడానికి సృష్టించాడు. టీ చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడానికి తాను ఈగోయిస్ట్ టీపాట్‌ను తయారు చేయాలని నిర్ణయించుకున్నట్టుగా నిర్మల్ సేథియా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. టీపాట్ కు అసాధారణ పేరు ఎందుకు వచ్చిందో వివరిస్తూ, ఇది ఒక వ్యక్తికి మాత్రమే చెందిన టీపాట్, అందుకే దీనిని ఈగోయిస్ట్ అని పిలుస్తారు అని అన్నారు.
బంగారం, వెండి, రూబీ, వజ్రాలు పొదిగిన టీపాట్:
ఈగోయిస్ట్ ప్రపంచంలోని రెండు అత్యంత విలువైన లోహాలు, బంగారం, వెండితో తయారు చేయబడింది. అంతే కాదు, మొత్తం టీపాట్ 1658 మెరిసే వజ్రాలతో రూపొందించబడింది. ఈ టీపాట్ మూత థాయిలాండ్ నుండి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న 386 థాయ్, బర్మీస్ కెంపులతో రూపొందించారు. ఈ మాణిక్యాలు దాని బాహ్య భాగానికి కాషాయ రంగును ఇస్తాయి. ఈ పాట్ మధ్యలో ఉన్న ఎరుపు రంగు 6.67 క్యారెట్ల థాయ్ రూబీ పాట్ ఆకర్షణను మరింత పెంచుతుంది. టీ పాట్ పైభాగం బంగారం, వెండి, వజ్రం, రూబీతో తయారు చేయబడింది. దీనిని మరింత ప్రత్యేకంగా చేయడానికి ఈ టీ పాట్ హ్యాండిల్ కోసం ఏనుగు దంతాలను ఉపయోగించారు.
ఎంత ఖర్చవుతుంది?:
ఈ అత్యంత ఖరీదైన టీపాట్ ధర 3,000,000 USD ఉంటుందని చెబుతున్నారు. దీన్ని మన భారతీయ కరెన్సీలోకి మార్చి, ప్రస్తుత మార్కెట్ ధరను పరిశీలిస్తే, ది ఎగోయిస్ట్ విలువ దాదాపు రూ.25 కోట్లు. అని అంచనా.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..